ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రైతులకు సూచనలు…

ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రైతులకు సూచనలు

ముదిగుబ్బ మండలం పెద్ద చిగుళ్లరేవు, జొన్నలకొత్తపల్లి గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను రైతులు అధిగమించాలని అధికారులు సూచించారు.

వర్షాభావంతో వాడిపోతున్న పంటలను రక్షించేందుకు లీటర్ నీటికి 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ కలిపి పిచికారీ చేసుకోవాలని తెలిపారు. సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని, నీటి కుంటలు ఏర్పాటు చేసి వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలని సూచించారు. పంట సాగు చేసిన ప్రతి రైతు తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాలని తెలిపారు.

కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రవీంద్ర, వ్యవసాయ సిబ్బంది లక్ష్మీనారాయణప్ప, సాయిరామ్, ప్రియాంక, రైతులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor