ఆలూరు: ఏపీయూడబ్ల్యూజే తాలూకా మాజీ అధ్యక్షులు, ఎన్టీవీ శ్రీధర్ అన్నగారు నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆలూరు పట్టణంలోని పాత్రికేయులను ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు పలువురు పాత్రికేయ మిత్రులు కార్యక్రమానికి హాజరై, నూతన షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులు శ్రీధర్ అన్నగారిని శాలువాతో సత్కరించి, పూలమాల వేసి అభినందనలు తెలిపారు. నూతన వ్యాపార ప్రస్థానం విజయవంతంగా సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమానికి పాత్రికేయులను ఆహ్వానించి ఆత్మీయంగా ఆదరించిన శ్రీధర్ అన్నగారికి పాత్రికేయ మిత్రులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలూరు పట్టణానికి చెందిన పలువురు పాత్రికేయులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
