మర్తాడు అప్పర్ ప్రైమరీ పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

మర్తాడు అప్పర్ ప్రైమరీ పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ముదిగుబ్బ మండలం మర్తాడు గ్రామంలోని అప్పర్ ప్రైమరీ పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, విద్యార్థులతో దేశభక్తి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సోము, శ్రీకాంత్, ఆనంద్ తదితరులు పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిళ్లు, వాటర్ బాటిళ్లను విరాళంగా అందించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మధు, రామకృష్ణారెడ్డి (మీడియా), శివ, ప్రకాష్, మధు, మాజీ ఉప సర్పంచ్ కాటమయ్య, రామకేషులు, భాష్కర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించిన దాతలకు పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

Posted Under AP
Editor