డీఎస్పీ చొరవతో విడిపోయిన దంపతులు …..ఒక్కటయ్యారు…..
అర్ధరాత్రి దాకా సహనంతో దంపతులకు కౌన్సిలింగ్*
ఇరుకుటుంబాల్లో* *వెల్లివిరిసిన ఆనందం**
ముదిగుబ్బyes9 TV
ధర్మవరం డీఎస్పీ జగన్నాధ్ రావు చొరవతో గతంలో విడాకులు తీసుకున్న దంపతులు తిరిగి ఒక్కటయ్యారు
ఫ్యామిలీ కౌన్సెలింగ్ ద్వారా కుటుంబ వివాదానికి సామరస్యపూర్వక పరిష్కారం లభించింది.
పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన అశ్విని, ఆమె భర్త శ్రీనివాసులు కుటుంబ విభేదాల కారణంగా గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించి విడాకులు తీసుకున్నారు. ధర్మవరం డీఎస్పీ జగన్నాధ్ రావు గారు నాగారెడ్డిపల్లి గ్రామంలో పర్యటించి, గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుంటున్న సమయంలో అశ్విని తన కుటుంబ సమస్యను డీఎస్పీ గారి దృష్టికి తీసుకువచ్చారు. విషయాన్ని తెలుసుకున్న ధర్మవరం డీఎస్పీ గారు సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ముదిగుబ్బ రూరల్ సీఐ సునీత గారు, పట్నం ఎస్సై మహమ్మద్ అర్షద్ గారు వెంటనే బెంగళూరులో వున్న అశ్విని, భర్త శ్రీనివాసులును నచ్చజెప్పి ఇక్కడికి రప్పించారు. వారితోపాటు ఇరు కుటుంబ సభ్యులను ధర్మవరం డీఎస్పీ కార్యాలయానికి పిలిపించారు. అక్కడ ఫ్యామిలీ కౌన్సెలింగ్ అధికారుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్ సందర్భంగా ఇరువర్గాల సమస్యలను సానుకూలంగా విని, కుటుంబ బంధాల ప్రాధాన్యతను వివరించడంతో పాటు, పరస్పరం అర్థం చేసుకోవడం, సహనం, సఖ్యత మరియు ఒకరినొకరు గౌరవించుకోవడం ద్వారా కుటుంబ జీవితాన్ని సంతోషంగా కొనసాగించవచ్చని వారికి సూచించారు. కౌన్సెలింగ్ అనంతరం శ్రీనివాసులు తన భార్య అశ్వినితో కలిసి సఖ్యతగా కుటుంబ జీవితాన్ని కొనసాగించేందుకు అంగీకరించగా, అశ్విని కూడా తన భర్తతో కలిసి జీవించేందుకు అంగీకరించారు. దీంతో ఇరువురి మధ్య ఉన్న విభేదాలు తొలగి, ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో దంపతులను తిరిగి ఒక్కటి చేశారు. కుటుంబ సమస్యలను కౌన్సెలింగ్ ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించి, కుటుంబాలను నిలబెట్టేందుకు శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని పోలీసు అధికారులు తెలిపారు.
