అనంతపురం జిల్లా
- గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి.
- సంకల్పంతో గిరిజనులు ఎదగాలి…
- ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.
- ప్రతి ఒక్కరూ తమ పిల్లలను విద్యావంతులుగా చేయాలి…
- జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్
- గిరిజన సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం…
- ఎస్టీ కమిషన్ సభ్యులు పి.వెంకటప్ప
అనంతపురం, ఆగస్టు 9 :
గిరిజనుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, గిరిజనులు మంచి సంకల్పంతో అలాగే ఎదగాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని కుటుంబం లోనితమ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని గిరిజన భవన్ లో ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు పి.వెంకటప్ప, రాష్ట్ర ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు సభావత్ సోమ్లా నాయక్ పాల్గొన్నారు. అలాగే వివిధ గిరిజన సంక్షేమ, అభివృద్ధి సంఘాల ప్రతినిధులు, గిరిజన గురుకుల పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు, పలువురు గిరిజన మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
