పచ్చదనంతోనే పర్యావరణ పరిరక్షణ…

అనంతపురం జిల్లా రాయదుర్గం

• పచ్చదనంతోనే పర్యావరణ పరిరక్షణ

*విద్యార్థులతో విత్తన బంతులు తయారు చేయించి.. నగరవనంలో చల్లించిన ఎమ్మెల్యే కాలవ *15 వేల విత్తన బంతులతో రాయదుర్గం నగర వనంలో హరితహారం

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ సమీపంలోని అటవీ శాఖ పరిధిలోని నగరవనంలో పర్యావరణ పరిరక్షణకు
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు శ్రీకారం చుట్టారు.

_RSS ఆధ్వర్యంలో_ నిర్వహించిన ‘గ్రామ వికాస్” కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో విత్తన బంతులను తయారు చేయించారు. విద్యార్థుల చేతుల మీదుగా సుమారు 15 వేల విత్తన బంతులను నగరవనంలో చల్లించారు.
విత్తన బంతుల్లో _వేప, నేరేడు_ వంటి పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి ఉపయోగపడే మొక్కల విత్తనాలను వినియోగించారు. భవిష్యత్తులో ఈ విత్తనాల ద్వారా మొక్కలు పెరిగి పచ్చదనం మరింత విస్తరిస్తుందని ఎమ్మెల్యే కాలవ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్రామ వికాస్ కార్యక్రమం ద్వారా నైతిక విలువల ప్రాధాన్యంతో పాటు పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పచ్చదనం పెంచే చర్యలు చేపడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని అటవీ, పర్యావరణ శాఖ కూడా పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తోంది. చిన్నపిల్లలకు, విద్యార్థులకు చిన్ననాటి నుంచే మొక్కల అవసరం, ప్రాధాన్యతను తెలియజేయాలి. ఇలాంటి కార్యక్రమాల ద్వారా బాధ్యతాయుతమైన ఉత్తమ పౌరులుగా విద్యార్థులు ఎదుగుతారన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రాయదుర్గం అటవీ శాఖ డిఆర్ఓ దామోదర్ రెడ్డి, ఫారెస్ట్ బీట్ అధికారులు, వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

బైట్స్ : 1. కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్, రాయదుర్గం, అనంతపురం జిల్లా

Posted Under AP
Editor