అనంతపురం జిల్లా రాయదుర్గం
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం డీ.హీరేహాళ్ మండలం మురడి గ్రామంలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ ప్రచార కార్యక్రమం రెండో రోజు ఉత్సాహంగా సాగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి ఫలాలను ప్రజలకు వివరించేందుకు రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు పాల్గొని గ్రామంలో విస్తృతంగా పర్యటించారు.శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు మురడి గ్రామానికి చేరుకోగా, స్థానిక తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకుని కాల్వ శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ‘ఇంటింటికీ తెలుగుదేశం’ ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు.గ్రామంలోని ప్రతి ఇల్లూ తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు ఎమ్మెల్యే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు, రాబోయే రోజుల్లో చేపట్టబోయే అభివృద్ధి పనుల వివరాలను గ్రామస్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.గత ఐదేళ్ల వైసీపీ దుర్మార్గ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా స్తంభించిపోయింది. కూటమి ప్రభుత్వం రాకతో రాష్ట్రంలో మళ్లీ సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతున్నాయి. ఒకవైపు సూపర్ సిక్స్ సంక్షేమ ఫలాలు అందిస్తూనే, మరోవైపు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నాం. మురడి గ్రామంలో సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టామన్నారు.
