త్రాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి…

అనంతపురం జిల్లా కనేకల్

*త్రాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి*

– *: ఎల్.నినో ప్రభావంతో చాలావరకు జిల్లాలో నీటికి సంబంధించి సమస్యలు ఉంటాయి..*

– *: రాబోయే ఆగస్టు నెలలో త్రాగునీటి కోసం హెచ్.ఎల్.సి నుంచి కొంత నీళ్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి..*

– *: హెచ్‌ఎల్‌సి ద్వారా త్రాగునీటి కోసం ఎప్పటినుంచి అయితే నీటి కేటాయింపు వస్తాయో అప్పటినుంచీ ఖచ్చితంగా రెవెన్యూ, పోలీస్ అండ్ ఇరిగేషన్ సిబ్బందిలతో కలుపుకొని టాస్క్ ఫోర్స్ పెడతాం..*

– *: అనంతపురం జిల్లాలో కొత్తగా ఎట్టి పరిస్థితులోనూ వరి పంట సాగు చేయవద్దు..*

– *: రైతులకు జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ విన్నపం*

– *: కణేకల్ చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్..*

అనంతపురం, జులై 28 :

– *ఈసారి వర్షాభావంతో ఎల్.నినో ప్రభావం వలన చాలావరకు జిల్లాలో నీటికి సంబంధించి సమస్యలు ఉంటాయని, కాబట్టి మొదటి ప్రాధాన్యత త్రాగునీటికి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం కనేకల్ మండల కేంద్రం వద్దనున్న కనేకల్ చెరువును జిల్లా కలెక్టర్ పరిశీలించారు.*

– *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈరోజు కనేకల్ చెరువును, హెచ్.ఎల్.సిలో త్రాగునీటి పరిస్థితి పరిశీలించడం జరిగిందన్నారు. మనకు రాబోయే ఆగస్టు నెలలో కొంతవరకు త్రాగునీటి కోసం కొంత నీళ్లు రావడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. కాబట్టి రైతులకి అందరికీ కూడా విన్నపం ఏంటంటే.. ఈసారి వర్షాభావంతో ఎల్.నినో ప్రభావం వలన చాలావరకు జిల్లాలో నీటికి సంబంధించి సమస్యలు ఉంటాయని, కాబట్టి హెచ్‌ఎల్‌సి నుంచి వచ్చిన నీళ్లు కావచ్చు, అదే కాకుండా వర్షం నుంచి వచ్చిన నీళ్లు కావచ్చు ఇవన్నీ కూడా మొదటి ప్రాధాన్యత త్రాగునీటికి ఇస్తామని తెలిపారు. రైతులు మైక్రో ఇరిగేషన్ ద్వారా పంట పండించాలని, ఎట్టి పరిస్థితులోనూ వరి అన్నది తగ్గించాలని కోరుతున్నామన్నారు. ఎందుకంటే వరి లాంటి పంటల ద్వారా మనకు చాలా ఎక్కువ నీళ్లు వాడాల్సిన అవసరం వస్తుందని, ఒకవేళ వరి వేసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే, దయచేసి ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయంగా వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ (ఏడబ్ల్యూడీ టెక్నిక్) వాడాలని, దాంతో నీటి వాడకం యూసేజ్ చాలావరకు సుమారుగా ఒక 40-50 శాతం వరకు తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయని, వాటిని ఉపయోగించాలని కోరుతున్నామన్నారు. కొత్తగా ఎవరు కూడా దయచేసి వరి పంటలు అనంతపురం జిల్లాలో వేసుకోవద్దని కోరుతున్నామని తెలిపారు.*

– *హెచ్‌ఎల్‌సి పరిధిలో ఒకవేళ మనకు త్రాగునీటి కోసం ఎప్పటినుంచి అయితే నీటి కేటాయింపు వస్తాయో అప్పటినుంచీ ఖచ్చితంగా రెవెన్యూ, పోలీస్ అండ్ ఇరిగేషన్ సిబ్బందిలతో కలుపుకొని టాస్క్ ఫోర్స్ పెట్టడం జరుగుతుందన్నారు. ఎందుకంటే ఆ సమయంలో ఎట్టి పరిస్థితులో ఎవరు కూడా దయచేసి కొత్తగా మోటార్లు పెట్టుకొని కెనాల్స్ నుంచి నీళ్లు తీసుకెళ్లడానికి అవకాశాలు లేవన్నారు.ఈ సంవత్సరం ఎల్.నినో ప్రభావం వలన వర్షంతో చాలా ఇబ్బందులు ఉన్న సమయంలో దయచేసి ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలని కోరుతున్నామని తెలిపారు. జిల్లాలో సత్యసాయి స్కీమ్, రకరకాల ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్, పిఏబీఆర్, అదేవిధంగా చిన్న చిన్న రిజర్వాయర్లు జిల్లాలో ఉన్నాయని, ఇవన్నీ నింపగలిగితేనే సుమారుగా అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలో ఒక 800 గ్రామాలకి మనం నీళ్ళు ఇవ్వడానికి ఉంటుందన్నారు. కాబట్టి అత్యధిక ప్రాధాన్యతగా ఏవైనా నీరు వచ్చినా కూడా ఆ నీటిని 100 శాతం త్రాగునీరుగా వాడుకోవడానికే ప్రయత్నం చేస్తున్నామని, ఇందుకు అనంతపురం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్.ఎల్.సి ఎస్ఈ సుధాకర్ రావు, తహసీల్దార్ బ్రహ్మయ్య, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.*

Posted Under AP
Editor