కెనరా బ్యాంకు అధికారుల తీరును నిరసిస్తూ ఒంటిపై డీజిల్ పోసుకొని దంపతుల ఆత్మహత్యాయత్నం..

అనంతపురం జిల్లా-కళ్యాణదుర్గం

కెనరా బ్యాంకు అధికారుల తీరును నిరసిస్తూ ఒంటిపై డీజిల్ పోసుకొని దంపతుల ఆత్మహత్యాయత్నం..

అనంతపురం జిల్లా
కుందుర్పి మండల కేంద్రంలోని కెనరా బ్యాంకు అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మందలపల్లి గ్రామానికి చెందిన చంద్రకళ, నాగేంద్ర దంపతులిద్దరూ ఒంటిపై డీజిల్ పోసుకొని కెనరా బ్యాంకు ముందు ఆత్మహత్యాప్రయత్నం చేశారు.

సకాలంలో రైతులు దంపతులను నిలువరించారు.

ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ.. తమ మామ చేసిన పంట రుణాల అప్పు తీర్చాలంటూ బ్యాంక్ అధికారులు తమ ఖాతాలను ఓల్డ్ లో పెట్టారన్నారు.

ఐదు రోజుల క్రితం తమ కుమారులు ఇద్దరి మంజూరైన తల్లికి వందనం నగదు డ్రా చేసుకోకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

బ్యాంకు మేనేజర్ ని ఎన్నిసార్లు బతిమాలాడిన పట్టించుకోలేదని, బ్యాంకు బయటకు వెళ్ళండి అంటూ దౌర్జన్యం చేస్తున్నారని విలపించారు.

Posted Under AP
Editor