- పేకాటలో దంచి కొడుతున్న వసూళ్లు….!
- మూడు ముక్కలు వేసి హుండీలోకి వసూళ్లు
- నయా దందా మొదలుపెట్టిన పేకాట రాయళ్ళు
Yes 9 tv
ఉరవకొండ నియోజకవర్గం విడపనకండ్ల మండలం ఉండబండ గ్రామ పరిధిలో దేవాలయాల్లో భక్తుల సమర్పించే కనుకుల కోసం హుండీ ఏర్పాటు చేయడం మనం చూస్తుంటాం, కానీ ఇక్కడ పేకాట నుంచి 15 నిమిషాల ఒక్కసారీ వచ్చే ఆదాయం కోసం ఉండి ఏర్పాటు చేశారు. విషయం తెలిస్తే ఎవరైనా నోరు విలపెట్టాల్సిందే, కానీ ఇది ముమ్మాటికి నిజం . అధికారం మాటన నేతలుగా చలామణి అవుతూ అక్రమార్చన కోసం పేకాట శిబిరం నిర్వహిస్తున్న ఓ ముఠా బాగోతం. ఇది ఆ వివరాలు ఇలా ఉన్నాయి,
ఉరవకొండ, కూడేరు, విడపనకల్ మండలాలకు చెందిన అధికార పార్టీ గ్రామ మండల స్థాయి నాయకులు కొందరు ముఠాగా ఏర్పడి పేకాట ఆడిస్తున్నారు. ఈ విషయం బహిరంగ రహస్యమైనప్పటికీ చర్యలు చేపట్టడానికి అధికారులు నిర్లక్ష్యం లెక్కిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఉంటున్న ఒక నాయకుడు పోలీసులతో మాట్లాడి ఈ పేకాట నిర్వహణకు మార్గం ఏర్పాటు చేసినట్టు సమాచారం. మొట్టమొదటిసారిగా పెన్నా నది ఒడ్డున పేకాట మొదలుపెట్టారు, అక్కడ దాడులు జరిగి 10 లక్షలు పడింది, ఈ సంఘటన తర్వాత కుడేరు మండలంలో మరుట్ల అటవీ ప్రాంతానికి మకాం మార్చారు. అక్కడ ఫోటో వీడియోలను సేకరించిన స్థానికులు ఏకంగా జిల్లా ఎస్పీ కార్యాలయానికి అందజేశారు దాంతో చర్యలు చేపట్టాగా, ఒకరిపై గంజాయి కేసు నమోదు చేయడంతో బెదిరిన ముఠా తన మకాం ను ఉండబండి వీరభద్ర స్వామి దేవాలయం పక్కన కాలువ గట్ట దగ్గర టెంట్లు, టెంట్లు మార్చడం జరిగింది.
స్థానికుడైన ఒక వ్యక్తి మండలానికి చెందిన కొందరు ముఠాగా ఏర్పడి వ్యవహారం నడుపుతున్నారు. భాగస్తులకు విభేదాలు రాకుండా అక్కడ ఒక ఉండిను ఏర్పాటు చేశారట, లోనా బయట ఆడుతూ కోసుకు ఐదువేల రూపాయలు, ఆడించినందుకుగాను హుండీలో వేయాలట అలా ఎన్ని కోసులు ఆడితే అన్ని 5000 వస్తాయన్నమాట, ఇలా ప్రతిరోజు రెండు నుంచి మూడు లక్షల దాకా వసూలు అవుతున్నట్టు సమాచారం. రాత్రి పది గంటలకు ఆట మొదలెడితే తెల్లవారుజామున 4 గంటల వరకు ఆడిస్తారు, ఈ లెక్కన లక్షలాది రూపాయలు రాత్రికి రాత్రి చేతులు మారుతున్నాయి, ఇలా హుండీలో వేసిన మొత్తం మండలానికి చెందిన సభ్యుడు ఉదయాన్నే తెలుస్తాడట వచ్చిన మొత్తంలో 20000 పోలీసులకు మిగతా సొమ్ము ముఠా సభ్యులు పంచుకునేలా ఒప్పందం కుదిరిందంట.
ఇంత జరుగుతున్న ఎందుకు చర్యలు చేపట్టలేదు అనే అంశాన్ని విశదీకరిస్తూ మరో కథనంలో వెల్లడిస్తాం…….!!!!
