Latest Posts

కర్నూలు జిల్లా ఆలూరు,,షార్ట్‌కట్ మార్గంలో ప్రైవేట్ బస్సులు..గ్రామస్తుల ఆగ్రహం…

— కర్నూలు జిల్లా ఆలూరు,,షార్ట్‌కట్ మార్గంలో ప్రైవేట్ బస్సులు..గ్రామస్తుల ఆగ్రహం…
–అనుమతించిన జాతీయ రహదారిపై బస్సులు నడపాలని డిమాండ్..
–సమస్య పరిష్కరించకపోతే రహదారి దిగ్బంధానికి హెచ్చరిక..
ఆంధ్రప్రదేశ్–కర్ణాటక రాష్ట్రాల మధ్య నడిచే కొన్ని ప్రైవేట్ బస్సులకు ప్రభుత్వం నిర్దేశించిన ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు, హలహార్వి, చింతకుంట, కారేకల్, హగిరి, బళ్ళారి ప్రధాన జాతీయ రహదారిపై ప్రయాణించేందుకు అనుమతులు ఉన్నప్పటికీ, ఆ మార్గం వెళ్లకుండా. బస్సులు షార్ట్‌కట్ మార్గాలను ఆదోని, ఆలూరు, హలహార్వి, వయా చత్రగుడి, మోక, బళ్లారి వెళుతున్నాయని, మేదహల్, కామినేహల్, చింతకుంట, కరేకల్, హగేరి గ్రామస్థులు, విద్యార్థులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. దీంతో జాతీయ రహదారి వెంట ఉన్న గ్రామస్తులు సమయానికి బస్సులు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, అధికారులు స్పందించడం లేదని గ్రామస్తులు విమర్శించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అనుమతించిన మార్గంలోనే ప్రైవేట్ బస్సులు నడిచేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జాతీయ రహదారిపై పెద్దఎత్తున రహదారి దిగ్బంధం చేపడతామని గ్రామ ప్రజలు ప్రభుత్వ అధికారులను హెచ్చరించారు.

Posted Under AP
Editor