ముదిగుబ్బ Yes9 TV
ముదిగుబ్బ,ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని వేగవంతం చేసి, మిగిలిన ప్రక్రియను రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని ప్రత్యేక అధికారి జనార్ధన్‌రావు బీఎల్‌వోలకు ఆదేశించారు. శుక్రవారం ఆయన ముదిగుబ్బ మండలంలోని పలు బూత్‌లను పరిశీలించి నమోదు ప్రక్రియ పురోగతిని సమీక్షించారు.
ముదిగుబ్బ పట్టణంలోని 70, 60, 61 బూత్‌లతో పాటు కొడవండ్లపల్లి పంచాయతీ పరిధిలోని 37, 39 బూత్‌లు, మర్తాడు గ్రామంలోని 43, 44 బూత్‌లను సందర్శించి ఇంటింటి ధృవీకరణ, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, నమోదు వివరాలను పరిశీలించారు. ప్రతి అర్హత ఓటరిని చేరుకుని నమోదు ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని బీఎల్‌వోలకు సూచించారు.
ముదిగుబ్బ మండలంలో ఇప్పటివరకు 73.72 శాతం ఎస్‌ఐఆర్ నమోదు పూర్తయిందని అధికారులు తెలిపారు. గడువు సమీపిస్తున్నందున మిగిలిన పనులను వేగవంతం చేసి రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని ప్రత్యేక అధికారి జనార్ధన్‌రావు ఆదేశించారు.
ఈ పరిశీలనలో ఎంపీడీఓ హాజీ వలి, పంచాయతీరాజ్ డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసులు, ఎంఈఓ-1 వెంకటాచలపతి, ముదిగుబ్బ తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ తుమ్మల మనోహర్, బీఎల్‌వోలు పాల్గొన్నారు. అనంతరం జరిగిన పర్యటనలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు జానగాని శివయ్య, గంగాధర్, వీరన్నరప్ప, హరి రాయల్, ప్రభాకర్, అంకె శంకర్, అంకె కృష్ణ తదితరులు పాల్గొన్నారు
రెండు రోజుల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలి..
