- ఉరవకొండ ఐసీడీఎస్‌లో అంగన్వాడీ ఆయాలకు నియామక పత్రాలు
- 19 మందికి నియామకాలు.. కుక్కర్ల పంపిణీ చేసిన మంత్రి పయ్యావుల కేశవ్
ఉరవకొండ, జూలై 3: ఉరవకొండ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని ఐదు మండలాల నుంచి ఎంపికైన 23 మంది అంగన్వాడీ ఆయాలలో 19 మందికి రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు అందజేసిన కుక్కర్లను కూడా మంత్రి పంపిణీ చేశారు. నూతనంగా నియమితులైన ఆయాలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన సేవలు అందేలా అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ సాజిదా, ఉరవకొండ ఐసీడీఎస్ సీడీపీఓ డాక్టర్ బి.ఎన్. శ్రీదేవి, సూపర్వైజర్లు అరుణ, ధనశేఖర్, అధికారులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
