ప్రభుత్వ భూములపై కూటమి నాయకుల డేగ కన్ను
ముదిగుబ్బ yes9TV
ముదిగుబ్బ మండల జెకెపల్లి రెవెన్యూ పొలంలో ఉండే 33 బి 49 ఏ 50 51 సర్వే నంబర్లలో ఉన్నటువంటి రాళ్ల అనంతపురం క్రాస్ నందు కల భూమిలోకి 2024 తాసిల్దార్ గారి అనుమతితో సిపిఎం సిఐటియు ఆవాస్ ఆధ్వర్యంలో పేదలకు గుడిసెలు వేయడానికి ఆగస్టు 18 వ తేదీ 2024 లో భూ పోరాటానికి వెళ్ళాము అక్కడ స్థానిక రాజకీయ నాయకులు భూస్వాములు మమ్ములను పేదలపై గుడిసెలు వేయడానికి వెళ్లినటువంటి పేదలపై దౌర్జన్యం చేసి అటకాయించడం జరిగింది ఈ అన్యాయాన్ని తాసిల్దార్ గారి దృష్టికి అప్పట్లో తీసుకెళ్లడం జరిగింది కానీ అనేకసార్లు ఈ సర్వే నెంబర్ లపై హెచ్చరిక బోర్డులను వేయాలని కోరిన రెవెన్యూ అధికారులు స్పందించలేదు ఇదే విషయం ఆర్డీవో గారికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కలెక్టర్ గారి ఆదేశాలు కూడా రెవెన్యూ అధికారులు మేఖాతరు చేశారు మేము తాసిల్దార్ గారిని ఈసీ కోరగా 29 2024లోబి ఎండాస్మెంట్ ఎఫ్ఎంబి అడంగల్ మాకు అందజేయడం జరిగింది పై తెలిపిన సర్వే నెంబర్లలో వన్ బి 101 అసైన్మెంట్ ఇంటి పట్టాలు వివరాలు ఈ కార్యాలయం నందు తాసిల్దార్ గారు ఎండాస్మెంట్ ఇచ్చినారు కానీ 2026 జూన్ 28వ తేదీన కూటమి నాయకులు పై తెలిపిన సర్వే నెంబర్లను ప్రవేశించి ప్రయత్నించి జెసిపితో చదును చేయగా అక్కడ ఉన్నటువంటి కార్మికులు అడ్డుకోవడం జరిగింది కావున ప్రభుత్వ భూమిని కాపాడవలసిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉన్నది కావున ఈ భూమిని కాపాడవలసిందిగా కోరుచున్నాము లేనియెడల సిపిఎం సిఐటియు ఆవాజ్ నాయకులు కార్యకర్తలను ఇల్లు లేని నిరుపేదలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఆటో పెద్దన్న సిఐటియు మండల కార్యదర్శి బాబ్జాన్ కోకన్వీనర్ ముస్తఫా అల్లా ప్రకాష్ ఖాదర్ వలీ, హాజీవలి రహీం తదితర నాయకులు పాల్గొన్నారు…
