అనంతపురం, జూలై 1:
ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం
( ఎస్ ఐ ఆర్-2026 ) నిర్వహణలో భాగంగా నిర్వర్తిస్తున్న విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే ఎన్నికల కమిషన్ నిబంధన మేరకు క్రమశిక్షణ చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ హెచ్చరించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ ఐ ఆర్ యొక్క ఉద్దేశం ప్రాముఖ్యత కార్యాచరణ షెడ్యూల్ వివరించారు అలాగే ఇంటింటి ధ్రువీకరణ కార్యక్రమం, జాబితా ప్రచురణ, క్లైమ్ లో అభ్యంతర స్వీకరణ వాటి పరిష్కారం తుది ఓటరు జాబితా ప్రచురణ ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ తదితర కార్యక్రమాలగురించి వివరించారు.
అనంతరం మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 20 38 5 2 3 మంది తుదిఓటర్లు ఉన్నారని ఇప్పటివరకు 19 88575 ఓటర్లకు ఎన్యుమరేషన్ పంపిణీ చేయడం జరిగింది అన్నారు. ఇందులో 50 18 25 దాకా అప్లోడ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. మిగిలినవి రాబోయే 12 రోజుల్లోగా పూర్తి చేయుటకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.
స్పెషల్ ఎంటెన్సీ రివిజన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బిఎల్ఏలు, రాజకీయ పార్టీలు సహకారాన్ని అందించాలని కోరారు. క్షేత్రస్థాయిలో బిఎల్వోలు సూపర్వైజర్లు ఏ ఈ ఆర్ వో లు విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు రుజువైతే ఎన్నికల కమిషన్ నిబంధన మేరకు క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులు అడిగిన పలు సందేహాలకు జిల్లా కలెక్టర్ సమగ్రంగా వాటిని నివృత్తి చేసి భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ప్రస్తుత ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పెండింగ్ లో ఉన్న డిజిటైజేషన్ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు.
ప్రజలందరూ బుక్ ఎ కాల్ విత్ బిఎల్ఓ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అనంతరం పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో కొంతమంది బి ఎల్ ఓ లో ఇంటింటి సందర్శనలు సక్రమంగా నిర్వహించడం లేదని తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ అలాంటి వారిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
బి ఎల్ ఏ లను కూడా ఎనుమరేషన్ ఫారాల స్వీకరణలో భాగస్వామ్యం చేయాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి మాలోల, ఎన్నికల విభాగం డిప్యూటీ తాసిల్దార్ కనకరాజు, ఎస్ ఏ శ్యాముల్ బెంజిమెన్, టిడిపి ప్రతినిధి నారాయణస్వామి బిజెపి ఈశ్వర్ ప్రసాద్, జనసేన కిరణ్ కుమార్, వైయస్సార్సీపి సోమశేఖర్ రెడ్డి ,అమర్నాథ్ రెడ్డి సిపిఐ ఎం బాల రంగయ్య, ఐ ఎన్ సి ఇమామ్ వలి, బీఎస్పీ అంజయ్య, ఆప్ మసూద్ వలి తదితరులు పాల్గొన్నారు.
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు……
