అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం
వృద్ధురాలి గొంతు కోసి హత్య చేసి 3 తులాల బంగారం,50 వేల నగదు దోచుకెళ్లిన గుర్తుతెలియని దుండగులు.
అనంతపురం జిల్లా
కళ్యాణదుర్గం పట్టణంలో మంగళవారం సాయంత్రం దారుణం చోటుచేసుకుంది.
కళ్యాణదుర్గం పట్టణంలోని ధర్మవరం రోడ్డులో గల వడ్డే కాలనీ లో నివాసం ఉంటున్న లక్ష్మీదేవి (75) వృద్ధురాలని సాయంత్రం గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హత్య చేసి ఒంటిమీద ఉన్న చెవి కమ్మలు, మెడలో చైన్ దాదాపు 3 తులాల బంగారం, 50 వేల రూపాయలు నగదు దోచికెళ్లిన గుర్తు తెలియని దుండగులు .
సమాచారం అందుకున్న పట్టణ సిఐ హరినాథ్ సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడతామన్నారు.
