Latest Posts

మాదకద్రవ్యాల నిర్మూలనలో విశేష సేవలు..

అనంతపురం ఈగల్ సెల్ అధికారికి రాష్ట్ర స్థాయి ప్రశంస

మాదకద్రవ్యాల నిర్మూలన, అక్రమ రవాణా నియంత్రణ, యువతలో డ్రగ్స్‌పై అవగాహన కల్పించడం, డ్రగ్ వ్యతిరేక కార్యక్రమాల నిర్వహణలో విశేష సేవలు అందించిన అనంతపురం జిల్లా ఈగల్ సెల్ అధికారి బి. హనుమంతు రాష్ట్ర స్థాయి ప్రశంసలు అందుకున్నారు.
రాష్ట్ర ఈగల్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గౌరవ హోం మంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా బి. హనుమంతుకు ప్రహంసిస్తూ సర్టిఫికెట్ తో పాటు ఈగల్ ఎక్సలెంట్ అవార్డు ను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఈగల్ ఐజీపీ మాట్లాడుతూ.. బాలగాని హనుమంతు సేవలను అభినందించారు. ఇదే స్ఫూర్తితో మాదకద్రవ్యాల నిర్మూలన, అక్రమ రవాణా నియంత్రణలో మరింత సమర్థవంతంగా పనిచేసి యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు కృషి కొనసాగించాలని సూచించారు.
అనంతపురం జిల్లాలో పాఠశాలలు, కళాశాలలు, పరిశ్రమలు, గ్రామాలు, ప్రజా ప్రదేశాల్లో డ్రగ్స్ దుష్పరిణామాలపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, మాదకద్రవ్యాల నిర్మూలనకు విశేషంగా కృషి చేస్తున్న బి. హనుమంతుకు రాష్ట్ర స్థాయి గుర్తింపు రావడం జిల్లాకు గర్వకారణమని జిల్లా అధికారులు తెలిపారు. ఈ అవార్డు జిల్లాలో డ్రగ్స్ నిర్మూలన కోసం పనిచేస్తున్న ఈగల్ సెల్ సిబ్బందికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని అధికారులు పేర్కొన్నారు.

Posted Under AP
Editor