లెగసి వేస్ట్ డిస్పోజల్ నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయాలి…

*లెగసి వేస్ట్ డిస్పోజల్ నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయాలి*

– *జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలో లెగసి వేస్ట్ డిస్పోజల్ నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో లెగసి వేస్ట్ మేనేజ్మెంట్ పై పబ్లిక్ హెల్త్ శాఖ అధికారులు, ఏజెన్సీలతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.*

– *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో లెగసి వేస్ట్ మేనేజ్మెంట్ పేజ్-1 కింద 16.68 కోట్ల రూపాయలతో అనంతపురం కార్పొరేషన్, గుంతకల్లు, తాడిపత్రి, గుత్తి, కళ్యాణదుర్గం, రాయదుర్గం మున్సిపాలిటీల పరిధిలో తమిళనాడులోని ఈరోడ్ కు చెందిన మెస్సర్స్ జిగ్మా గ్లోబల్ ఎన్విరాన్ సొల్యూషన్స్ ఏజెన్సీ వారు పనులను చేపట్టడం జరగగా, వేగవంతంగా లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్ చేపట్టాలన్నారు. అనంతపురం కార్పొరేషన్ పరిధిలో 1,68,285 మెట్రిక్ టన్నుల లెగసి వేస్ట్ తొలగించాల్సి ఉండగా, నేటి వరకు 153737 మెట్రిక్ టన్నుల లెగసి వేస్ట్ పరిమాణం పరిష్కరించబడగా, అందులో తొలగించిన మొత్తం పరిమాణం 84,883 మెట్రిక్ టన్నులు ఉండగా, ఇంకా తొలగించాల్సిన బ్యాలెన్స్ 68,854 మెట్రిక్ టన్నులు ఉందని, పనులను వేగవంతంగా చేపట్టాలన్నారు. గుంతకల్లు మున్సిపాలిటీలో 20,000 మెట్రిక్ టన్నుల లెగసి వేస్ట్ తొలగించాల్సి ఉండగా, తొలగించిన మొత్తం పరిమాణం 11,485 మెట్రిక్ టన్నులు ఉండగా, ఇంకా తొలగించాల్సిన బ్యాలెన్స్ 8,515 మెట్రిక్ టన్నులు ఉందని, ఆగస్టు 15వ తేదీ నాటికి మొత్తం డిస్పోజల్ పూర్తి కావాలన్నారు. తాడిపత్రి మున్సిపాలిటీలో 22,735 మెట్రిక్ టన్నుల లెగసి వేస్ట్ తొలగించాల్సి ఉండగా, వెంటనే పనూలు ప్రారంభించాలన్నారు. గుత్తి మున్సిపాలిటీలో 4,563 మెట్రిక్ టన్నుల లెగసి వేస్ట్ తొలగించాల్సి ఉండగా, తొలగించిన మొత్తం పరిమాణం 795 మెట్రిక్ టన్నులు ఉండగా, ఇంకా తొలగించాల్సిన బ్యాలెన్స్ 3,768 మెట్రిక్ టన్నులు ఉందని, జూలై నాటికి మొత్తం డిస్పోజల్ పూర్తి కావాలన్నారు. రాయదుర్గం మున్సిపాలిటీలో 6,919 మెట్రిక్ టన్నుల లెగసి వేస్ట్ తొలగించాల్సి ఉండగా, తొలగించిన మొత్తం పరిమాణం 5,883 మెట్రిక్ టన్నులు ఉండగా, పనులు పూర్తి కావడం జరగగా, కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో పనులను ప్రారంభించాల్సి ఉందన్నారు.*

– *లెగసి వేస్ట్ మేనేజ్మెంట్ పేజ్-2 కింద అనంతపురం కార్పొరేషన్ పరిధిలో 16.54 కోట్ల రూపాయలతో M/s థారుని అసోసియేట్స్ ఏజెన్సీ వారు పనులు చేపట్టగా, మొత్తం 2,10,196.00 మెట్రిక్ టన్నుల లెగసి వేస్ట్ తొలగించాల్సి ఉండగా, నేటి వరకు 41,296.00 మెట్రిక్ టన్నుల లెగసి వేస్ట్ పరిమాణం పరిష్కరించబడగా, అందులో తొలగించిన మొత్తం పరిమాణం 1,597.00 మెట్రిక్ టన్నులు ఉండగా, ఇంకా తొలగించాల్సిన బ్యాలెన్స్ 39,699.00 మెట్రిక్ టన్నులు ఉందని, పనులను వేగవంతంగా చేపట్టాలని, వచ్చే అక్టోబర్ నాటికి మొత్తం పనులను పూర్తి చేయాలన్నారు. తమిళనాడులోని ఈరోడ్ కు చెందిన మెస్సర్స్ జిగ్మా గ్లోబల్ ఎన్విరాన్ సొల్యూషన్స్ వారు 8.01 కోట్ల రూపాయలతో రాయదుర్గం మున్సిపాలిటీలో మొత్తం 1,01,957.00 మెట్రిక్ టన్నుల లెగసి వేస్ట్ తొలగించాల్సి ఉండగా, నేటి వరకు 76,696.00 మెట్రిక్ టన్నుల లెగసి వేస్ట్ పరిమాణం పరిష్కరించబడగా, అందులో తొలగించిన మొత్తం పరిమాణం 5,566.00 మెట్రిక్ టన్నులు ఉండగా, ఇంకా తొలగించాల్సిన బ్యాలెన్స్ 71,130.00 మెట్రిక్ టన్నులు ఉందని, రెండు నెలల్లో పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. మెస్సర్స్ జిగ్మా గ్లోబల్ ఎన్విరాన్ సొల్యూషన్స్ వారు 4.82 కోట్ల రూపాయలతో గుంతకల్లు మున్సిపాలిటీలో మొత్తం 61,269.00 మెట్రిక్ టన్నుల లెగసి వేస్ట్ తొలగించాల్సి ఉండగా, నేటి వరకు 9,353.00 మెట్రిక్ టన్నుల లెగసి వేస్ట్ పరిమాణం పరిష్కరించబడగా, పనులు పురోగతిలో ఉండగా, రెండు నెలల్లోగా పనులను పూర్తి చేయాలన్నారు. లెగసి వేస్ట్ పనులు చేపట్టడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి ఇబ్బందులు రావడానికి వీలులేదని, తమ నుంచి కావాల్సిన సహకారం అందిస్తామని, ఏజెన్సీలవారు ఈ సమస్య ఉన్న పబ్లిక్ హెల్త్ ఈఈతో మాట్లాడాలన్నారు. లెగిసి వేస్ట్ డిస్పోజల్ అయితేనే పేమెంట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇందులో నెలకొన్న ఆపరేషన్ సమస్యలు పరిష్కారం కావాలని, ఏ కంపెనీ కూడా ఇంకొక కంపెనీని ఇబ్బంది పెట్టడానికి వీలులేదన్నారు. ఏజెన్సీ వారు పనిచేయకపోతే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపల్ కమిషనర్లతో సమన్వయం చేసుకొని పనులను టైం లైన్ ప్రకారం వేగవంతంగా చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఈఈ సూర్యనారాయణ, డిఈ జ్యోతి, వర్చవల్ విధానంలో ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.*

Posted Under AP
Editor