అనంతపురం జిల్లా కలెక్టరేట్
*మాదకద్రవ్య రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం కావాలి*
– *: సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి మాదకద్రవ్యాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి*
– *: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్*
– *డ్రగ్స్ మరియు గంజాయి సమస్యను అరికట్టడంలో అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేయాలని, జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం కావాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో మాదకద్రవ్యాలు మరియు గంజాయి నియంత్రణ చర్యలు – అవగాహన కార్యక్రమాల సమీక్షకు సంబంధించి ఎన్సిఓఆర్డీ (నార్కో కోఆర్డినేషన్ సెంటర్, NCORD) జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని జిల్లా ఎస్పీ పి.జగదీష్ తో కలిసి జిల్లా కలెక్టర్ నిర్వహించారు.*
– *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చాలన్నారు. విద్యాసంస్థల్లో వారానికొకసారి అవగాహన కార్యక్రమాలు డిఈఓ, ఆర్ఐఓ, ఆర్జెడిలు పాఠశాలలు మరియు కళాశాలల్లో డ్రగ్స్, గంజాయి దుష్ప్రభావాలపై ప్రతి వారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో మాదకద్రవ్యాల వినియోగం లేదా విక్రయాలపై అనుమానాస్పద సమాచారం సమాచారం లభిస్తే వెంటనే పోలీసు శాఖకు తెలియజేయాలన్నారు. ఈగల్ క్లబ్స్ సమాచారాన్ని పోలీసులతో పంచుకోవాలని, ప్రైవేట్ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఈగల్ క్లబ్స్ ద్వారా సేకరించిన సమాచారాన్ని తక్షణమే పోలీసు శాఖకు అందించాలన్నారు. గుట్కా, గంజాయి విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని, పాఠశాలల సమీపంలో గుట్కా, గంజాయి మరియు ఇతర నిషేధిత ఉత్పత్తుల విక్రయాలపై సమాచారం సేకరించి సంబంధిత శాఖలకు పంపాలన్నారు. డీ-అడిక్షన్ కేంద్రాల్లో అవసరమైన సిబ్బంది మరియు వైద్య అధికారుల నియామకానికి చర్యలు చేపట్టాలన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ (NMBA) నిధులను పూర్తిస్థాయిలో వినియోగించి విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పోలీసు, విద్య, వైద్య మరియు ఇతర సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి మాదకద్రవ్యాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. మాదకద్రవ్య రహిత జిల్లా లక్ష్యం కావాలని, యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు అన్ని శాఖలు సమిష్టిగా పనిచేయాలని ఆదేశించారు. జూన్ 26వ తేదీన అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా జిల్లాలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వికలాంగుల సంక్షేమ శాఖ ఏడిని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇచ్చిన అన్ని ఆదేశాల అమలుపై చేపట్టిన చర్యల వివరాలతో తదుపరి సమావేశానికి యాక్షన్ టెకన్ రిపోర్టు (Action Taken Report. ATR) సమర్పించాలని సంబంధిత శాఖలకు సూచించారు. విశ్వవిద్యాలయాల్లో ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేయాలని, ఎస్.కె.యూనివర్సిటీ (SKU) మరియు జేఎన్టీయూ అనంతపురం (JNTUA) లో ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసి, క్లబ్ సభ్యుల వివరాలను సంబంధిత అధికారులకు సమర్పించాలని ఆదేశించారు. ఎస్.కె.యూనివర్సిటీ, జేఎన్టీయూ విశ్వవిద్యాలయాల్లో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు, సెమినార్లు, ర్యాలీలు మరియు ఇతర కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థుల్లో చైతన్యం కల్పించాలని సూచించారు.*
– *జిల్లా ఎస్పీ పి.జగదీష్ మాట్లాడుతూ పోలీసు శాఖ మరియు ఈగల్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించే డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సులు, సెమినార్లు, ర్యాలీలు మరియు ఇతర కార్యక్రమాలకు పూర్తి సహకారం అందించాలని పాఠశాలలు మరియు కళాశాలల యాజమాన్యాలకు సూచించాలని ఆదేశించారు. అవగాహన కార్యక్రమాల నిర్వహణకు మద్దతు పోలీసు శాఖ అధికారులు, ఈగల్ సెల్ సిబ్బంది విద్యాసంస్థలకు వచ్చి అవగాహన కార్యక్రమాలు నిర్వహించే సమయంలో అవసరమైన వేదిక, విద్యార్థుల సమీకరణ మరియు ఇతర ఏర్పాట్లలో యాజమాన్యాలు సహకరించాలని సూచించారు. యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడడం విద్యాసంస్థలు, పోలీసు శాఖ, ఈగల్ సెల్ మరియు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి విద్యార్థుల్లో మాదకద్రవ్యాల పట్ల అవగాహన పెంచి, డ్రగ్-ఫ్రీ క్యాంపస్‌లుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు.*
– *ఈ సమావేశంలో క్రైమ్ రికార్డు బ్యూరో (డిసిఆర్బి) సిఐ వలిభాష, డిటిసి వీర్రాజు, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి అర్చన, డివిఈఓ గురువయ్య శెట్టి, డిప్యూటీ డిఈవో లక్ష్మన్న, ఆర్ఐఓ వెంకటరమణ నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి సాలురెడ్డి, హార్టికల్చర్ డిడి ఉమాదేవి, బీసీ సంక్షేమ శాఖ డిడి కుష్బూ కొఠారి, ఎపిఎస్ఆర్టిసి డిఎం శ్రీకాంత్, ఈగల్ సెల్ అధికారి హనుమంతు, కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణారెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.*
