అనంతపురం జిల్లా
*పసుపుమయంగా మారిన సింగనమల.. కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభ ఘన విజయం*
*భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన టిడిపి శ్రేణులు*
*సూపర్ సిక్స్ పథకాలతో సూపర్ హిట్‌గా రెండేళ్ల కూటమి పాలన*
*ప్రధాని మోదీ గారి సహకారం..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో రాష్ట్రంలో అభివృద్ధి వేగం పెరిగింది*
*రాయలసీమకు సాగునీరు, రాష్ట్రానికి పారిశ్రామికాభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం..అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు గారు*
సూపర్ సిక్స్ పథకాలతో సూపర్ హిట్‌గా రెండేళ్ల కూటమి పాలన కొనసాగుతోందని అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు గారు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైన సందర్భంగా సింగనమల నియోజకవర్గం నార్పల మండలం దుగ్గుమర్రి గ్రామంలో నిర్వహించిన విజయోత్సవ సభలో జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు గారు పాల్గొన్నారు. నార్పల నుంచి సభా వేదిక వరకు టిడిపి శ్రేణులు భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. సభా ప్రాంగణమంతా పసుపు మయంగా మారిపోయింది. సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ గారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు, నియోజకవర్గ పరిశీలకుడు, ఏపీ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మన్నెం సుబ్బారెడ్డి గారు, ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి గారు, ద్విసభ్య కమిటీ సభ్యుడు ఆలం నరసానాయుడు గారు, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు, మాజీ జడ్పిటిసి రామలింగారెడ్డి గారు, టిడిపి సీనియర్ నాయకుడు పర్వతనేని శ్రీధర్ బాబు గారితో పాటు కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూల నాగరాజు గారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహకారం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి కృషితో రాష్ట్రం అరాచకం నుంచి అభివృద్ధి వైపు పయనిస్తోందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సంక్షేమం, అభివృద్ధి విప్లవానికి శ్రీకారం చుట్టిందన్నారు. ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రధాన దృష్టి పెట్టి మెగా డీఎస్సీ, పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. గత ఐదేళ్లలో రాష్ట్రంపై భారీ అప్పుల భారం పడిందని, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టారని చెప్పారు. ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తేదీన జీతాలు, పెన్షన్లు అందించడం ద్వారా పరిపాలనలో క్రమశిక్షణ తీసుకొచ్చారని పేర్కొన్నారు. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో పోలవరం ప్రాజెక్టు, జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే అభివృద్ధి, పోర్టుల విస్తరణ వంటి కీలక ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన,వంటి పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయని తెలిపారు. పారిశ్రామిక రంగంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని, మంత్రి నారా లోకేష్ గారి కృషితో రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయని, లక్షలాది ఉద్యోగ అవకాశాలు యువతకు లభిస్తున్నాయని పేర్కొన్నారు. సింగనమల నియోజకవర్గంలో ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయని పూల నాగరాజు గారు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అనంతపురం జిల్లాతో పాటు రాష్ట్రంలోని ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, గ్రామీణ మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలుతో ప్రజల్లో విశ్వాసం మరింత బలపడుతోందని పూల నాగరాజు గారు పేర్కొన్నారు. ప్రత్యేకంగా పుట్టపర్తి ప్రాంతంలో 5వ జనరేషన్ యుద్ధ విమానాల తయారీ పరిశ్రమలు రావడం, ఉమ్మడి అనంతపురం జిల్లాలో రక్షణ రంగ పరిశ్రమలు స్థాపన కావడం రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి నిదర్శనమన్నారు. వ్యవసాయ రంగంలో హంద్రీనీవా కాలువ విస్తరణ ద్వారా రాయలసీమ రైతులకు సాగునీటి భద్రత కల్పిస్తున్నామని, గ్రామీణాభివృద్ధి మరియు మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. రాష్ట్రంలో ఇంత అభివృద్ధి జరుగుతున్నప్పటికీ వైసీపీ నాయకులు వాస్తవాలను చూడకుండా విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, పారదర్శక పరిపాలనతో ముందుకు సాగుతూ రానున్న మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతుందని పూల నాగరాజు గారు స్పష్టం చేశారు.
