గుడ్ చిల్డ్రన్ స్కూల్‌లో అగ్నిమాపక శాఖ అవగాహన కార్యక్రమం…

*గుడ్ చిల్డ్రన్ స్కూల్‌లో అగ్నిమాపక శాఖ అవగాహన కార్యక్రమం*

*అగ్ని ప్రమాదాలు, వరదల సమయంలో అప్రమత్తంగా ఉండాలి: ఏడీఎఫ్‌ఓ లింగమయ్య*

అనంతపురం, జూన్ 20:
అనంతపురం రూరల్ మండల పరిధిలోని ఆలమూరు రోడ్డులో ఉన్న గుడ్ చిల్డ్రన్ పాఠశాలలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా అదనపు అగ్నిమాపక అధికారి (ఏడీఎఫ్‌ఓ) కె.పీ. లింగమయ్య ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు, సిబ్బందికి అగ్ని ప్రమాదాలు మరియు వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా అగ్నిమంటల్లో చిక్కుకున్నప్పుడు సురక్షితంగా బయటపడే విధానాలు, ఇతరులను రక్షించే పద్ధతులు, వరద పరిస్థితుల్లో పాటించాల్సిన జాగ్రత్తలను ప్రత్యక్ష ప్రదర్శనల ద్వారా వివరించారు. విద్యార్థుల్లో విపత్తులపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.
ఇటీవల నిర్వహించిన అగ్నిమాపక శాఖ వారోత్సవాలను జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్‌రెడ్డి నాయకత్వంలో విజయవంతంగా నిర్వహించినట్లు లింగమయ్య పేర్కొన్నారు. పాఠశాలల్లో అగ్నిమాపక శాఖ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
పాఠశాల కరస్పాండెంట్ సాయి సాగర్ మాట్లాడుతూ, అగ్నిమాపక శాఖ సూచించిన భద్రతా నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు అభినందనీయమని ఆయన అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు అగ్నిమాపక శాఖ నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని హర్షిస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. విద్యార్థి దశలోనే విపత్తుల సమయంలో ఎలా స్పందించాలో తెలుసుకోవడం ద్వారా ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ఏడీఎఫ్‌ఓ లింగమయ్య పేర్కొన్నారు.

Posted Under AP
Editor