ఎస్ఐఆర్ – 2026ను పారదర్శకంగా చేపడుతున్నాం…..

*ఎస్ఐఆర్ – 2026ను పారదర్శకంగా చేపడుతున్నాం.*

– *: ఎస్ఐఆర్ – 2026పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అందించాలి..*

– *: అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగించబడదు.. అర్హత లేని వారిని నిబంధనల మేరకు తొలగించి పారదర్శక, దోష రహిత ఓటరు జాబితా లక్ష్యంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుంది*

– *: ఈసీఐ నిబంధనల మేరకు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ద్వారా 330 నూతన పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలతో జిల్లాలో 2556 కానున్న పోలింగ్ కేంద్రాలు*

– *: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్..*

అనంతపురం, జూన్ 20 :

– *జిల్లాలో ఎస్ఐఆర్ – 2026 కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా చేపట్టడం జరుగుతుందని, అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగించబడదు.. అర్హత లేని వారిని నిబంధనల మేరకు తొలగించి పారదర్శక, దోష రహిత ఓటరు జాబితా లక్ష్యంగా ఎస్ఐఆర్ ప్రక్రియ జిల్లాలో కొనసాగుతుందనీ, దానికి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు.*

– *అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.*

– *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ ద్వారా ఆబ్సెంట్, షిఫ్టెడ్,డూప్లికేట్, మరణించిన వారిని జాబితా నుండి తొలగించి పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించనున్నట్లు తెలిపారు. ఏ ఒక్క అర్హులైన ఓటరును తొలగించడం జరగదని, అనర్హులను నిబంధనల మేరకు తొలగించడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో పోలింగ్ స్టేషన్ ల పరిధిలో బిఎల్ ఓ లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల వారు తమ ప్రతినిధులను బిఎల్ఏ లని తప్పక ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్ ప్రచురణ అనంతరం ప్రతిపాదిత ఓటర్ల అర్హతలను చట్టప్రకారం ERO మరియు AERO లు నిశితంగా పరిశీలిస్తారని తెలిపారు. ఓటరు అర్హతలపై ఎలాంటి అనుమానాలున్నా సుమోటోగా విచారణ జరిపి, నోటీసులు జారీ చేస్తారని, క్లెయిమ్స్- అభ్యంతరాల పరిశీలన తర్వాత స్పష్టమైన ‘స్పీకింగ్ ఆర్డర్’ ద్వారా తుది నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. ఇంటింటి సర్వేలో భాగంగా బూత్ లెవెల్ అధికారులు (BLO) ఓటర్ల నుండి నింపిన ఎన్యుమరేషన్ ఫారాలను (Form-EF) అవసరమైన పత్రాలతో సహా సేకరించి, ఓటరుకు అక్నోలెడ్జ్ చేస్తారని వివరించారు. ఆ ఫారాలను మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుందన్నారు. నకిలీ ఓట్లు, చనిపోయిన వారి పేరిట ఓట్ల నమోదు వంటి అక్రమాలను అడ్డుకునేందుకు ఈ ప్రక్రియ ఎంతో కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. ఓటర్ల నమోదులో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారంతో మోసాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఓటర్ల జాబితా అత్యంత పారదర్శకంగా, నిజాయితీగా ఉండేలా చూసేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ లెవెల్ ఏజెంట్లు (BLA) పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. ఎన్యూమరేషన్ ప్రక్రియ చురుకుగా కొనసాగుతుందని తెలిపారు.*

– *జిల్లా రెవెన్యూ అధికారి ఎ.మలోల వివరిస్తూ ఈ రోజు వరకు జిల్లాలో 20,38,523 మంది ఓటర్లు ఉన్నారని, పోలింగ్ స్టేషన్ హేతుబద్ధీకరణ (Polling Station Rationalization) అనేది ఓటర్లు సులభంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా పోలింగ్ కేంద్రాలను పునర్వ్యవస్థీకరించే ప్రక్రియ అని, ఎన్నికల సంఘం (ECI) మార్గదర్శకాల మేరకు ఈ ప్రక్రియను నిర్వహించుచున్నామని తెలిపారు. ఒక పోలింగ్ స్టేషన్‌లో ఓటర్ల సంఖ్య సాధారణంగా 1,200 మించకుండా చూస్తారనీ, ఓటర్ల సంఖ్య పెరిగితే, వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి కొత్త బూత్‌లను ఏర్పాటు చేస్తారని, దూరం తగ్గించడం మరియు ఓటరు తన ఇంటి నుండి ఓటు వేయడానికి సాధారణంగా 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించ కూడదనేది నిబంధన అని తెలిపారు. సౌకర్యాలు ప్రతి పోలింగ్ కేంద్రంలో తగినంత స్థలం, తాగునీరు, విద్యుత్, ర్యాంప్ (దివ్యాంగుల కోసం) ఉండేలా భవనాలను ఎంపిక చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధుల సూచనలు సలహాలు తీసుకొని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. సాధారణంగా ఓటరు ఓటు వేయడానికి 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం లేని విధంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 2226 పోలింగ్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, హేతుబద్ధీకరణ అనంతరం 330 పోలింగ్ కేంద్రాలు అదనంగా ప్రతిపాదించగా మొత్తం పోలింగ్ కేంద్రాలు 2556 కి చేరుకున్నాయని తెలిపారు. పోలింగ్ కేంద్రాలను మార్చినందుకు గల కారణాలను వివరించారు. ఇందులో 48 పోలింగ్ స్థానాలు మార్పు, 7 పోలింగ్ కేంద్రాల నామ రూపం మార్పులు చేయడానికి ప్రతిపాదించామని తెలిపారు.*

– *ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం డిప్యూటీ తహసిల్దార్ కనకరాజు, సీనియర్ అసిస్టెంట్ శ్యాముల్, బిజెపి ప్రతినిధి ఈశ్వర్ ప్రసాద్, బీఎస్పీ ప్రతినిధి అంజయ్య, టిడిపి ప్రతినిధి నారాయణస్వామి, వైఎస్ఆర్సిపి ప్రతినిధి అమర్నాథ్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి మసూద్ వలి, సిపిఐ (ఎం) ప్రతినిధులు బాలరంగయ్య, నల్లప్ప, కాంగ్రెస్ ప్రతినిధి ఎంఎండి ఇమామ్ వలి, జనసేన పార్టీ ప్రతినిధి కిరణ్ కుమార్ పాల్గొన్నారు.*

Posted Under AP
Editor