*రెవిన్యూ శాఖ సేవలు ప్రజలకు అత్యంత కీలకం*
*ప్రజలతో నిత్యం మమేకమయ్యే రెవిన్యూ శాఖ సేవలు మరింత సమర్థవంతంగా కొనసాగాలి*
*పారదర్శకత, సేవాభావమే రెవిన్యూ శాఖ లక్ష్యం*
*సాంకేతికతతో వేగవంతమైన సేవలందించాలి*
*రెవిన్యూ దినోత్సవ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్
సి. విష్ణు చరణ్
అనంతపురం, జూన్ 20 : రెవిన్యూ శాఖ సేవలు ప్రజలకు అత్యంత కీలకమని, ప్రజలతో నిత్యం మమేకమయ్యే రెవిన్యూ ఉద్యోగులు తమ సేవలను మరింత సమర్థవంతంగా కొనసాగించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి . విష్ణు చరణ్ పిలుపునిచ్చారు.
శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లోని పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో రెవెన్యూ డే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికిముఖ్యఅతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్
సి. విష్ణు చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రెవెన్యూ అధికారి మాలోల, పలువురు తాసిల్దార్లు కలెక్టరేట్ ఉద్యోగ సిబ్బంది తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ..ప్రతి రెవెన్యూ ఉద్యోగి తమ విధులను భాద్యతగా నిర్వర్తించాలన్నారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని అందుకొని ప్రభుత్వం అందిస్తున్న పథకాల లబ్దిని ప్రజలకు అందించాలన్నారు. రెవిన్యూ శాఖలో విపత్తు నిర్వహణ ఒక భాగం అయ్యిందన్నారు. ప్రభుత్వం అప్పగించిన విధులను పారదర్శకంగా, సేవాభావమే లక్ష్యంగా పనిచేసి రెవెన్యూ శాఖ ప్రతిష్టను మరింత పెంచాలన్నారు.
రెవెన్యూ శాఖ అత్యంత కీలకమైనదని, ప్రజలకు చిత్తశుద్ధితో తమ సేవలను అందించాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సేవల నాణ్యత పెంపు కోసం సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరం అని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రజలకు భూ సంబంధిత సేవలను మరింత సులభతరం చేయడం భూ వివాదాల పరిష్కారం రెవెన్యూ రికార్డుల డిజిటిలైజేషన్ అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు వంటి అంశాలలో రెవెన్యూ శాఖ సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు. జిల్లాలో భూ రీ సర్వే పట్టాదారు పాసు పుస్తకాల మంజూరు వారసత్వ మార్పిడి భూహక్కుల పరిరక్షణ ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులకు తక్షణ సహాయం అందించడం వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడం జరుగుతున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా రెవెన్యూ శాఖ తన కీలక పాత్రను పోషిస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ప్రయోజనాలు చేకూరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమన్వయంతో రెవెన్యూ శాఖ అధికారులు ఇతర ఉద్యోగ సిబ్బంది పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించే విధంగా రెవెన్యూ ఉద్యోగుల సమన్వయంతో పనిచేసి ఈ శాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అలాగే ప్రతి ఫైలును పరిశీలించి ఖచ్చితంగా పరిష్కారం చూపాలన్నారు ప్రజలకు రెవెన్యూ శాఖపై విశ్వసనీయత కలిగే విధంగా సేవలందించాలని సూచించారు.
జిల్లా రెవెన్యూ అధికారి మాలోల మాట్లాడుతూ….
రెవెన్యూ ఉద్యోగులు ప్రజలకు మరింతగా నాణ్యమైన సేవలు అందించే విధంగా అంకితభావంతో పనిచేయాలని తెలిపారు. రెవెన్యూ శాఖ సాధించిన విజయాలను సమావేశంలో గుర్తు చేశారు. తమ బాధ్యతలను పారదర్శకంగా నిరరించాలన్నారు. భవిష్యత్తులో మరింత సమర్థవంతమైన సేవలు రెవెన్యూ శాఖ ద్వారా అందించేందుకు సంకల్పం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పరిపాలన సంస్కరణలు భూ పరిపాలనలో పారదర్శకత ప్రజలకు వేగవంతమైన సేవలందించుటలో రెవెన్యూ శాఖ సాధించిన విశిష్ట సేవలను పురస్కరించుకొని జిల్లాలో రెవెన్యూ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు చేరువైన పాలన భూ సంబంధిత సేవల సరళీకరణ సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమల్లో రెవెన్యూ శాఖ పోషించిన కీలకపాత్రను డిఆర్ఓ వివరించారు. పరిపాలనలో రెవెన్యూ శాఖ కీలకమని ప్రస్తుత రీ సర్వే పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ వంటి కీలకమైన పనులను బాధ్యతగా ప్రజలకు సేవలు అందించి పారదర్శకంగా నిజాయితీగా పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా ఉద్యోగ బాధ్యతలతో పాటు ఆరోగ్యం కుటుంబ వ్యక్తిగత జీవితాలను కాపాడుకోవాలని డిఆర్ఓ సూచించారు.
చివరగా రెవిన్యూ శాఖలో సేవలందించి పదవి విరమణ చేసిన పలువురు అధికారులను ఉద్యోగ సిబ్బందిని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారిని జాయింట్ కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.
అంతకుముందు కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కార్యక్రమానికి చివరి దశలో
జాయింట్ కలెక్టర్ ను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రామకృష్ణారెడ్డి ఆనంద్ రామ్మోహన్ పద్మావతి, కలెక్టరేట్ ఏవో అలెగ్జాండర్, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ సంఘం అధ్యక్షులు దివాకర్ బాబు రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
