తాడిపత్రి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో “యోగాంధ్ర” కార్యక్రమం….

తాడిపత్రి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో “యోగాంధ్ర” కార్యక్రమం..

– యోగాంధ్ర – 2026 కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం తాడిపత్రి పట్టణంలోని ఆధ్యాత్మిక ప్రాంతం, పర్యాటక స్థలమైన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో “యోగాంధ్ర” కార్యక్రమం నిర్వహణ.. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, మార్కెట్ యార్డు చైర్మన్ భూమా నాగరాగిని, తదితరులు పాల్గొన్నారు.

– జిల్లా కలెక్టర్, మార్కెట్ యార్డు చైర్మన్, తదితరులు యోగాసనాలు చేసి అందరిలో స్ఫూర్తి నింపారు. యోగా మాస్టార్లు డా.ఏ.మురళీకృష్ణ, రవిప్రసాద్, గోవిందరెడ్డి, మమతా కర్నూలు, ఎం.రాజశేఖర్ రెడ్డి, తిప్పయ్య అందరిచేత యోగాసనాలు వేయించారు.

– కార్యక్రమంలో ఇన్చార్జ్ ఆర్డీఓ రామ్మోహన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా టూరిజం అధికారి ఓబులమ్మ, యోగాంధ్ర జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ లాల్య నాయక్, ఆయుష్ వైద్యాధికారి డా.తిరుపతి నాయుడు, సివిల్ సప్లై డిఎం రమేష్ రెడ్డి, డ్వామా పిడి సలీం భాష, మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ, తహసీల్దార్ రవిచంద్ర, ఎంపిడిఓ చలపతి, డిఈ రాంప్రసాద్ రెడ్డి, ఏఈలు నాగేంద్ర, తేజ, ఏక్నాథ్, ఎంఈఓలు నాగరాజు, రామ గోవిందరెడ్డి, అధికారులు, అనధికారులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

Posted Under AP
Editor