యోగాంధ్ర జిల్లా స్థాయి పోటీలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్

అనంతపురం జిల్లా

యోగాంధ్ర జిల్లా స్థాయి పోటీలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్

అనంతపురం, జూన్ 15:
యోగేంద్ర జిల్లా స్థాయి పోటీల్లో భాగంగా స్థానిక ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న యోగబ్యాసం పోటీలను జిల్లాజాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ పరిశీలించారు. మంగళవారం సాయంత్రం అశోక్ నగర్ వద్ద ఉన్న ఇండోర్ స్టేడియంలో యోగ పోటీ ప్రదర్శనలను కాసేపు తిలకించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ యోగ వల్ల ఆరోగ్యం పదిలంగా ఉంటుందన్నారు. ప్రజలందరి ఆరోగ్యం కోసం యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని ప్రతి ఒక్కరు తమ ఆరోగ్య పరిరక్షణ కోసం యోగాను అలవర్చుకోవాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా యోగా కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగానిర్వహించడంజరుగుతుందని పేర్కొన్నారు.
జిల్లా స్థాయి యోగా పోటీల్లో పాల్గొన్న వారికి ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఆర్డిఓ రామ్మోహన్, ఆహుడా సెక్రెటరీ రామకృష్ణారెడ్డి, డిఐపిఆర్ఓ బాలకొండయ్య, ఆయుష్ డా. తిరుపతి రెడ్డి, డా. రామ్ కుమార్, డా. రాజశేఖర్, పిడి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor