ముదిగుబ్బ కో-ఆప్షన్ సభ్యుడు చిన్న బాలముని గుండెపోటుతో హఠాన్మరణం

కో ఆప్షన్ సభ్యుడు చిన్న బాలముని గుండెపోటుతో మృతి రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి, ,వైసిపి, టిడిపి, నాయకులు నివాళి…
ముదిగుబ్బ మండల కేంద్రంలో వైయస్సార్ పార్టీ కో ఆప్షన్ సభ్యుడు చిన్న బాలముని శుక్రవారం అర్ధరాత్రి సమయంలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు 20 ఏళ్లుగా వైయస్సార్ పార్టీకి సేవలు అందించిన వ్యక్తిగా గుర్తింపు ఉంది రాష్ట్ర నూర్ భాషా దూదేకుల సంఘం అధ్యక్షుడు ఓ రసూల్, మహమ్మద్ రఫీ, పులివెందుల నుండి చేరుకొని నివాళులర్పించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మృతిని స్వగృహముకు చేరుకొని పూలమాల వేసి నివాళులర్పించారు పార్టీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులను ఓదార్చారు అనంతరం ఎంపీపీ ఆదినారాయణ యాదవ్, మండలంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రమేష్ బాబు, మండల కన్వీనర్ ప్రభాకర్ నాయుడు, మక్కా మసీద్ ముస్లిం సభ్యులు కుటుంబ సభ్యులు స్థానికులు నివాళులు అర్పించి అంత్యక్రియలు పూర్తి చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ రాష్ట్ర సేవాదళ్ సెక్రెటరీ ఇందుకూరు నారాయణరెడ్డి, మండల కన్వీనర్ సివి నారాయణరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు మీసేవ చంద్ర, లోకేశ్వర్ రెడ్డి, మస్తానమ్మ, జయమ్మ ,లక్ష్మీదేవి, మాజీ సర్పంచ్ లక్ష్మీదేవి చెన్ రాయుడు, తదితరులు పాల్గొన్నారు…

Posted Under AP
Editor