కురువ నాగేష్ పై దాడి చేసిన వారిపై కేసు నమోదుచేసి అరెస్ట్ చేయాలి
-మాదాసి మాదారి ఎస్సీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు కేపీ.బ్రహ్మయ్య
పత్తికొండ జూన్ 03:- ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని ఎర్రకోట గ్రామానికి చెందిన మాదాసి మదారి కురవ ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కురువ నాగేష్ ను అదే నియోజకవర్గ కేంద్రమైన కడిమెట్ల గ్రామానికి చెందిన కొంతమంది వాల్మీకులు సోదరులు గత రెండు రోజులు క్రితం తమ ఫర్టిలేజర్ షాప్ లో విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచిన వారిపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి రిమాండ్ పంపాలని పత్తికొండ మాదాసి మదారి కురువ ఎస్సీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు కెపి.బ్రహ్మయ్య డిమాండ్ చేశారు,బుధవారం స్థానిక పత్తికొండ పట్టణంలోని విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి మాదాసి మాదారి కురువ ఎస్సీ సంక్షేమ సంఘం నియోజకవర్గ నాయకులు కరణం నరేష్,అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా కేపీ.బ్రహ్మయ్య హాజరై వారు మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎర్రకోట గ్రామంలో కురవ నాగేష్ జీవన ఉపాధి కోసం ఫర్టిలేజర్ షాపు నిర్వహించుకుంటు జీవనం కొనసాగిస్తున్నాడు అలాంటి వ్యక్తిపై కడిమెట్ల గ్రామానికి చెందిన వైసిపి పార్టీకి సంబంధించిన వాల్మీకి సోదరులు మందులు అప్పు ఇవ్వలేదని కారణంతోనే విచక్షణ రహితంగా ఆయన పై దాడి చేయడమే కాకుండా షాపును ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసం అని ధ్వజమెత్తారు.కావున స్థానిక పోలీసులు వెంటనే వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో మాదాసి మాదారి కురువ ఎస్సి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాదాసి మదారి కురువ ఎస్సి సంక్షేమ సంఘం నియోజవర్గ ప్రధాన కార్యదర్శి మైలర్,పందికోన శీను,ఉరుకుందు,పులికొండ తదితరులు పాల్గొన్నారు
