మారెమ్మ జాతరకు హాజరైన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లె సిందూర రెడ్డి
నల్లమాడ మండలం గోపేపల్లి తండాలో అత్యంత వైభవంగా నిర్వహించిన మారెమ్మ జాతరకు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యే పల్లె సిందూర రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మారెమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మారెమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి రాష్ట్ర అభివృద్ధికి మరింత శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
జాతరకు విచ్చేసిన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లె సిందూర రెడ్డి కి గోపేపల్లి తండా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. పూలవర్షం కురిపిస్తూ, హారతులు ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
అనంతరం తండాలో పర్యటించిన మాజీ మంత్రి గ్రామ ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, రహదారులు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలను గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు కార్యకర్తలు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
