Latest Posts

పెనుకొండ వద్ద ఘోర ప్రమాదం: లారీని ఢీకొట్టిన మరో లారీ.. డ్రైవర్ సజీవదహనం!

సెంటర్ పెనుకొండ శ్రీ సత్యసాయి జిల్లా

శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి ఢీ కొట్టిన ఘటనలో లారీ పూర్తిగా కాలిపోయి డ్రైవర్ సజీవ దహనమైన సంఘటన చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల మేరకు హైదరాబాదు నుండి గోధుమల లోడుతో బెంగళూరుకు వెళ్తున్న ముందు వెళ్తున్న లారీని వెనక నుండి మరొక లారీ బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా ముందు వెళ్తున్న లారీలో మంటలు వ్యాపించాయి అయితే డ్రైవర్ ముందు భాగంలో ఇరుక్కుపోవడంతో తెలంగాణ ఆదిలాబాద్ కు చెందిన డ్రైవర్ కిరణ్ పూర్తిగా సజీవ దహనం అయిపోయారు. పోలీసులకు సమాచారం రావడంతో ఫైర్ సిబ్బందితో పోలీసులు సంఘటన స్థానాలు చేరుకొని ట్రాఫిక్ నియంత్రించి లారీని ఫైర్ సిబ్బందితో ఆర్పివేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు..

Posted Under AP
Editor