కార్యకర్తల కష్టసుఖాల్లో భాగస్వామ్యం – పత్తికొండ నియోజకవర్గ పరిధిలో ఉన్న చక్రాల గ్రామానికి విచ్చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్
పత్తికొండ మండలం చక్రాల గ్రామంలో ఏబీవీపీ పూర్వపు విద్యార్థి నాయకుడు, కరీంనగర్ – నిజామాబాద్ ప్రాంతాలలో ఏబీవీపీ ఫుల్ టైం వర్కర్‌గా పనిచేసిన చక్రాల సుధాకర్ గారి అమ్మగారికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆమెను పరామర్శించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు గ్రామానికి విచ్చేశారు.
ఈ సందర్భంగా పత్తికొండ బీజేపీ మండల అధ్యక్షుడు కరణం నరేష్ కేంద్రమంత్రి బండి సంజయ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. కార్యకర్తల కష్టసుఖాలలో భాగస్వామ్యం అవుతూ, వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ప్రత్యేకంగా గ్రామానికి రావడం బండి సంజయ్ గారి సేవాభావానికి నిదర్శనమని కొనియాడారు.
కార్యకర్తల పట్ల బీజేపీ నాయకత్వం చూపుతున్న ఆప్యాయత, అంకితభావం కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తుగ్గలి నవీన్ రెడ్డి . బ్రహ్మయ్య దండి మల్లికార్జున, రామాంజనేయులు సిసి రంగన్న గోవర్ధన్ నాయుడు ఎద్దులదొడ్డి లక్ష్మణస్వామి రాంపల్లి రంగయ్య వీరేష్ హరీష్ నాయక్ గోరంట్ల కరణం చంద్రన్న తంబల నాగేష్ సురేంద్ర రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు
