Latest Posts

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టిన చంద్రబాబు: వై ప్రణయ్ రెడ్డి ధ్వజం

*రాయలసీమ ఎత్తిపోతల పథకం పై చంద్రబాబు మోసం మోసం అనే సదస్సుకు హాజరైన రాష్ట్ర విద్యార్థి విభాగం రాయలసీమ జోనల్ ఇంచార్జ్ వై ప్రణయ్ రెడ్డి గారు*

వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో రాయలసీమ జిల్లాల శాశ్వత కరువు నివారణ చర్యలో భాగంగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టి 80 శాతం పనులు పూర్తి చేయడం జరిగింది కానీ ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిగిలిన పనులను నిలుపుదల చేసి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తాకట్టు పెట్టడం జరిగింది దీనికి సంబంధించి రాయలసీమ ఎత్తిపోతల పథకం చంద్రబాబు మోసం అనే సదస్సు తిరుపతి మరియు పీలేరు దగ్గరలో ఉన్న లేక్ వ్యాలీ రిసార్ట్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యార్థి విభాగం నాయకులు మరియు ముఖ్య నాయకులు తో పాటు రాష్ట్ర విద్యార్థి విభాగం జోనల్ ఇన్చార్జ్ ప్రణయ్ రెడ్డిగారు కూడా హాజరవ్వడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టకుండా మీ స్వప్రయోజనాల కోసం చూసుకోకుండా రాయలసీమలో ఉన్న రైతుల కోసం దీన్ని వెంటనే పూర్తి చేయాలని వై ప్రణయ్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విద్యార్థి విభాగం నాయకులతో పాటు మాజీ మంత్రివర్యులు సాకే శైలజనాథ్ గారు కూడా హాజరయ్యారు

Posted Under AP
Editor