Latest Posts

తాడిమర్రిలో ఘనంగా మేడే వేడుకలు – కార్మికుల ఐక్యతకు నిదర్శనం

తాడిమర్రి (yes9tv)తాడిమర్రిలో ఘనంగా మేడే వేడుకలు – కార్మికుల ఐక్యతకు నిదర్శనం
తాడిమర్రి మండలంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వీరభద్ర స్వామి గుడి వద్ద ఉదయం 9 గంటలకు జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది.
ఈ కార్యక్రమంలో అంగన్వాడి, ఆశా వర్కర్లు, మిడ్ డే మిల్ సిబ్బంది, సత్యసాయి వాటర్ సిబ్బంది, వివిధ కార్మిక సంఘాలు, రైతు సంఘాల ప్రతినిధులు మరియు ప్రజా సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. కార్మికుల హక్కులు, సంక్షేమం, కనీస వేతనాలు, భద్రతా చర్యలు వంటి ముఖ్య అంశాలపై చర్చలు జరగనున్నాయి.
అలాగే కార్మికుల ఐక్యతను చాటుతూ మానవహారం మరియు ర్యాలీ నిర్వహించబడుతుంది. ఈ ర్యాలీ ద్వారా కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయనున్నారు.
కార్మికుల హక్కుల సాధన కోసం ఐక్యతతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలకు తాడిమర్రి మండల సిఐటియు కమిటీ ఆహ్వానం పలికింది

Posted Under AP
Editor