తాడిమర్రి మండలంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించాలి – సిఐటియు పిలుపు

తాడిమర్రి(yes 9 tv)
తాడిమర్రి మండలంలోని వీరభద్ర స్వామి దేవాలయం సమీపంలో మే 1న మేడే (అంతర్జాతీయ కార్మిక దినోత్సవం) సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించబడనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు పెద్దఎత్తున పాల్గొనాలని సిఐటియు మండల కమిటీ పిలుపునిచ్చింది.
ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, వాటర్ సప్లై కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు, రైతు సంఘాల ప్రతినిధులు, ఇతర కార్మిక సంఘాలు, రైతులు అందరూ పాల్గొని మేడే జెండాను ఎగురవేయాలని కోరారు.
అదేవిధంగా, మేడే సందర్భంగా ఆహారం (ఆహార భద్రత) అంశంపై అవగాహన ర్యాలీ కూడా నిర్వహించబడుతుంది. కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం ఐక్యంగా పోరాడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
సిఐటియు కమిటీ సభ్యులు పూర్తి స్థాయిలో హాజరై, కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మండల కార్యదర్శి పి. నారాయణ విజ్ఞప్తి చేశారు.
కావున, కార్మికులు, రైతులు, ప్రజలు అందరూ కలిసికట్టుగా పాల్గొని మేడే వేడుకలను విజయవంతం చేయాలని మనవి.

Posted Under AP
Editor