గౌరవనీయులైన అనంతపురం జిల్లా ఎస్పీ P. జగదీష్, IPS గారి ఆదేశాల మేరకు గుంతకల్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ A. శ్రీనివాస్ గారి సూచనలు మేరకు గుంతకల్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యనగర్, SJP హై స్కూల్ వెనుక సమీపంలోని బయలు ప్రదేశంలో సెల్ ఫోన్ లో చూస్తూ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని రాబడిన సమాచారం మేరకు గుంతకల్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్, ఇన్స్పెక్టర్ B. మనోహర్ గారు మరియు సిబ్బంది ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించి గుంతకల్ టౌన్ కు చెందిన మునాఫ్, రఘునాథ్ ప్రసాద్, అచ్యుత హరికృష్ణ అను ముగ్గురు బెట్టింగ్ రాయుళ్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2,75,000/- రూపాయలు, మరియు ఒక మొబైల్ ఫోన్ ను స్వాధీన పరచుకోవడం అయినది.
పోలీస్ శాఖ వారి తరఫున గుంతకల్ పట్టణ ప్రజలకు తెలియజేయడమేమనగా క్రికెట్ బెట్టింగ్ అనేది ఒక జూదం. డబ్బులకు ఆశపడి అనవసరంగా క్రికెట్ బెట్టింగ్ జోలికి వెళ్లి ఆర్ధిక ఇబ్బందులు పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దండి.
గుంతకల్ పట్టణంలో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్, మట్కా, గ్యాంబ్లింగ్ తదితర అసాంఘిక కార్యకలాపాల గురించి సమాచారం మీకు తెలిసినట్లయితే గుంతకల్ వన్ టౌన్ పోలీస్ వారికి సమాచారం తెలియజేయండి మీ పేర్లు గోప్యంగా ఉంచబడును.
B. మనోహర్.
ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
గుంతకల్ వన్ టౌన్ పీఎస్.
