Latest Posts

మాయదారి క్షయను తరిమి కొడదాం..

ముదిగుబ్బ, యస్ 9
మాయదారి క్షయను తరిమి కొడదాం
ఈరోజు ముదిగుబ్బ పి హెచ్ సి లోని దొరిగళ్ళు సచివాలయం యందు హెచ్ హెచ్ ఎక్స్ రే లు 94 మందికి తీయడం జరిగింది టిబి సూపర్వైజర్ శ్రీనివాసులు మాట్లాడుతూ టిబి ముక్త పంచాయతీలో భాగంగా భారతదేశము నందు క్షయ వ్యాధిని తరిమి కొట్టడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం హర్షించదగింది ఈ ఎక్సరే సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము 60 సంవత్సరాలు పైబడిన వారు పాత టీబి రోగులు వారి ఇంటిలోని వారు ధూమపానం చేయువారు ఆల్కహాల్ సేవించువారు మధుమేహ వ్యాధిగ్రస్తులు రక్తపోటు ఉన్నవారు బాడీ మాస్ ఇండెక్స్ 18.5 కన్నా తక్కువగా ఉన్నవారు అందరూ గల్ల పరీక్ష మరియు ఎక్స్ రే తీయించుకోవాలి చాలామంది పరీక్షల కొరకు చాలా దూరం వెళ్లి వేయ ప్రయాసలకు లోనయ్యి డబ్బు ఖర్చు పెట్టుకుని వస్తూ ఉన్నారు అలాంటిది ఎక్స్ రే మిషన్స్ మన ఊరికే వస్తున్నాయి కావున అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని కోరుతున్నాము ప్రతి ఒక్కరూ నడుము బిగించి క్షయ వ్యాధిని పారద్రోడడానికి ముందుకు రావాలి అలా వచ్చినప్పుడు మాత్రమే మన దేశము క్షయ నుండి విముక్తి పొందగలదు వారి ఇంటిలో ఉంది మాకేమి అనే నిర్లక్ష్యంగా ఉండదండి అలా ఉండడంవల్ల వారి నుంచి గాలి ద్వారా ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకొని క్షయ వ్యాధి నుంచి రక్షణ పొందాలని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో జిల్లా పిపిఎం నాగేంద్ర సూపర్వైజర్లు మురళీధర్ రెడ్డి విజయ్ కుమార్ పి పి ఎస్ ఏ విశ్వనాథ్ ఫిమేల్ సూపర్వైజర్ పార్వతమ్మ సి హెచ్ ఓ భారతి విజయ్ కుమారి ఆరోగ్య కార్యకర్తల మ రంగనాయకులు ఆశాలు లక్ష్మీదేవి ఉమాదేవి పాల్గొన్నారు

Posted Under AP
Editor