పశువుల మేత కాలిపోవడంతో లబోదిబోమన్న రైతు డి. శ్రీనివాసులు
ఆలూరు మండలం పరిధిలోని అంగస్కల్ గ్రామంలో దూదేకొండ శ్రీనివాసులు అనే రైతుకు చెందిన 4 గడ్డివాములు కాలిపోవడంతో ఆ రైతు రోదన చూపరులకు కంటి తడి పెట్టించింది. గడ్డివాములకు అగ్గి అంటుకోవడంతో పరిసర ప్రాంతాల్లోనే ప్రజలు గమనించి వెంటనే అగ్నిమాపక అధికారులకు విషయం తెలియజేయడంతో హుటాబుట్టిన అగ్నిమాపక అధికారులు సిబ్బంది గ్రామం చేరుకొని కాలుతున్న గడ్డివాములను నీరు చల్లి ఆర్పి వేశారు. బాధితుడు దూదెకొండ శ్రీనివాసులు తో విలేకరులు మాట్లాడగా ఆయన తన బాధను వ్యక్తం చేశారు. కాలిపోయిన నాలుగు గడ్డివాముల విలువ లక్ష రూపాయలు ఉంటుందని గడ్డివాములు అగ్నికి ఆహుతి కావడంతో పశువులకు మేత లేక మూగజీవాలు ఆకలితో అలమటించే పరిస్థితి ఏర్పడిందని వాటిని ఏ విధంగా కాపాడుకోవాలో దిక్కు తోచడం లేదని ఆయన రోదించారు. మా సమస్యను గుర్తించి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి మూగజీవాలకు మేత కొనుక్కునే విధంగా ప్రభుత్వ అధికారులు నివేదికలు పంపించి ఆదుకోవాలని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. అగ్నిమాపక అధికారులతో గ్రామస్తులు మాట్లాడుతూ అయ్యా దూదేకుల శ్రీనివాసులు పేద రైతు ఆయనకు ఉన్న గడ్డివాములు కాలిపోయాయి దయచేసి మీరు ఆయనకు సహాయం అందే విధంగా నివేదికలు ఇవ్వాలని పేద రైతులను ఆదుకోవాలని గ్రామస్తులు అగ్నిమాపక అధికారులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో బాధితులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
