Latest Posts

నంద్యాలలో సిఐటియు రాష్ట్ర మహాసభలు: పోస్టర్‌ను ఆవిష్కరించిన ముదిగుబ్బ కార్మిక నేతలు

ముదిగుబ్బ యస్ 9
ఏప్రిల్ 17,18,19, నంద్యాలలో సిఐటియు రాష్ట్ర 17వ మహాసభలు పోస్టర్ను విడుదల చేసిన ముదిగుబ్బ సిఐటియు సిపిఎం అవాజ్ నాయకులు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం అనేక త్యాగాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి 4 లేబర్ కోడ్స్ గా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా చేస్తున్నది అలాగే దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోశిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ,ఆస్తులను అన్నింటిని అమ్మేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది మన రాష్ట్రంలో అతి పెద్దదైన ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ముక్కలు చేసి అమ్మాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది అలాగే కార్మికులు ఎనిమిది గంటల పని విధానాన్ని మార్చి 10, 12 గంటలకు పెంచింది మహిళలతో రాత్రిపూట షిఫ్టుల్లో పనిచేయుచుకునేందుకు అనుమతిస్తూ చట్టం చేసింది ఇది కార్మికులను మరింత దోపిడీ చేయడానికి అవకాశం గా వాడుకుంటుంది అలాగే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ పేరును తొలగించి వి. బి. జి రాంజీగా పేరు మారుస్తూ వాటి ఉనికిని తొలగించే పద్ధతుల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి సిఐటియు ఏర్పడి 56 సంవత్సరాల కాలంలో కార్మిక వర్గం సమస్యల పరిష్కారం హక్కులు సంక్షేమం కోసం అనేక పోరాటాలను నిర్వహించి పలు విజయాలను సాధించింది సిఐటియు ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా నంద్యాల పట్టణంలో రాష్ట్ర 17వ మహాసభలు జరుగుతున్నాయి కావున ఈ మహాసభలకు రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల వివిధ ప్రాంతాల నుంచి 1000 మంది కార్మిక ఉద్యోగ ప్రతినిధులు, పరిశీలకులతోపాటు పలు ప్రజా సంఘాల నుంచి సౌహార్త ప్రతినిధులతో హాజరవుతున్నారు ఏప్రిల్ 17వ తేదీన ఉద్యోగులు కార్మికులతో భారీ ప్రదర్శన బహిరంగ సభ జరుగుతాయి కావున ఈ మహాసభలను నిర్వహణకు విజయవంతం చేయాలని సహాయ సహకారాలు అందించాలని ముదిగుబ్బ సిఐటియు మండల కమిటీ కోరుకున్నది ఈ కార్యక్రమంలో సిఐటియు ముదిగుబ్బ మండల కార్యదర్శి బాబ్జాన్ సిఐటియు కో కన్వీనర్ టైలర్ ముస్తఫా సిపిఎం మండల కార్యదర్శి ఆటో పెద్దన్న ఆవాజ్ గౌరవ అధ్యక్షులు ఫక్రుద్దీన్ రఫీ అల్లా బక్ష హాజువలి తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor