Latest Posts

ఉరవకొండలో ఘనంగా అంబేద్కర్ జయంతి: నివాళులర్పించిన రిటైర్డ్ సీడీపీఓ రామాంజినమ్మ

ఉరవకొండ లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాము
పేద, బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం, సమాన హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. సమాజంలో అంటరానితనాన్ని నిర్మూలించేందుకు, వివక్షకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయం
భారత రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన మహానుభావుడిని ఈ రోజు స్మరించుకోవడం మన అదృష్టం ఈ సందర్భంగా ఉరవకొండ అంబేద్కర్ నగరలో రిటైర్డ్ సిడిపిఓ ఎం రామాంజినమ్మ గారు మరియు అంగన్వాడీ టీచర్ ఎం ఉల్లిగశ్వరి గారు కాలనీ వాసులు డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.*

Posted Under AP
Editor