Latest Posts

రాష్ట్రంలో మరిన్ని ఎంజేపీ గురుకులాల ఏర్పాటు: రూ.500 కోట్లతో శాశ్వత భవనాలు – మంత్రి సవిత వెల్లడి

వత్సవాయి/జగ్గయ్యపేట* : విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో కొత్తగా మరిన్ని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. రాష్ట్రంలో విద్య కోసం కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. ముఖ్యంగా బీసీ బిడ్డల విద్యకు రూ.వందల కోట్లు వెచ్చిస్తోందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నడిచే గురుకులాల్లో ఎంజేపీ గురుకులాల అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నాయని మంత్రి సవిత తెలిపారు. అందుకే, రాష్ట్ర వ్యాప్తంగా ఎంజేపీ స్కూళ్లకు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మరిన్ని ఎంజేపీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
రూ.500 కోట్లతో ఎంజేపీ స్కూళ్లకు శాశ్వత భవనాలు నిర్మించనున్నామన్నారు. ఆరు ఎంజేపీ బాలికల గురుకులాలను ఇంటర్మీడియట్ కళాశాలుగా అప్ గ్రేడ్ చేయనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు.

Posted Under AP
Editor