అనంతపురం జిల్లా,జేఎన్‌టీయూ.
అనంతపురం
జేఎన్‌టీయూ ఏ ఇంజినీరింగ్ కాలేజ్, అనంతపురంలో ఉన్న పోస్టాఫీస్‌ను ఆధునిక సదుపాయాలతో ఎన్-జెన్ పోస్టాఫీస్ (N-Gen Post Office) గా రూపాంతరం చేయడం ఎంతో ప్రతిష్టాత్మకమైన ఘట్టమని సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్, అనంతపురం డివిజన్ శ్రీ కె. అమర్నాథ్ గారు తెలిపారు. గౌరవ వైస్ చాన్సలర్ గారు మాట్లాడుతూ, ఐఐటీల తర్వాత ఎన్-జెన్ పోస్టాఫీస్ ఏర్పాటు కోసం జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కాలేజ్ ఎంపిక కావడం విశేషమైన విషయం అని, ఇది జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయానికి మాత్రమే కాకుండా అనంతపురం ప్రజలకు కూడా గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గౌరవ వైస్ చాన్సలర్ గారు మరియు సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ గారు ఈ కార్యక్రమంపై ఆనందం వ్యక్తం చేస్తూ, ఈ ప్రాజెక్టును ప్రశంసించారు.
ఈ ఎన్-జెన్ పోస్టాఫీస్‌ను జేఎన్‌టీయూ అనంతపురం గౌరవ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ హెచ్. సుదర్శన రావు గారు 07.04.2026 న ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్. కృష్ణయ్య గారు, జేఎన్‌టీయూ ఏ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ పి. చెన్నారెడ్డి గారు, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దిలీప్ కుమార్ గారు, అన్ని విభాగాల హెడ్‌లు, అధ్యాపకులు, విద్యార్థులు, మీడియా ప్రతినిధులు మరియు ఇతర స్టేక్‌హోల్డర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గౌరవ వైస్ చాన్సలర్ గారు ఎన్-జెన్ పోస్టాఫీస్ ద్వారా అందించే సేవలను విద్యార్థులకు మరియు స్టేక్‌హోల్డర్లకు వివరించారు. ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగపడే సేవలైన:
గ్యాన్ పోస్టు (Gyan Post) ద్వారా విద్యా సంబంధిత పుస్తకాలు, మెటీరియల్‌ను అత్యంత తక్కువ ధరలకు పంపిణీ చేసే సౌకర్యం
సెలవుల సమయంలో హాస్టళ్లను ఖాళీ చేసే విద్యార్థులకు సౌకర్యవంతమైన పార్సల్ సేవలు
స్పీడ్ పోస్టు సేవలు మరియు నియామక పరీక్షలకు దరఖాస్తులు పంపించేందుకు విద్యార్థులకు 10% రాయితీ
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) సేవలు మరియు జీరో బ్యాలెన్స్ ఖాతాలు – స్కాలర్‌షిప్‌ల జమ కోసం
AEPS (Aadhaar Enabled Payment System) ద్వారా ఆధార్ ఆధారిత లావాదేవీలు
ఆధార్ సేవలు (Aadhaar Services) అందుబాటులో ఉండడం
క్యాష్‌లెస్ మరియు UPI సేవలు ద్వారా సులభమైన డిజిటల్ లావాదేవీలు
డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ పూర్తి చేసిన వారికి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (PLI) అర్హత
డాక్ ఘర్ నిర్యాత కేంద్ర (DNK) ద్వారా MSMEs వారికి విదేశీ పార్సిళ్ల పంపిణీ
లాజిస్టిక్స్ పోస్ట్ వంటి ఆధునిక సేవలు
విద్యార్థులు మరియు అధ్యాపకులు ఈ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని గౌరవ వైస్ చాన్సలర్ గారు పిలుపునిచ్చారు.
అదేవిధంగా, జేఎన్‌టీయూ అనంతపురం కోసం ప్రత్యేకంగా రూపొందించిన కస్టమైజ్డ్ మై స్టాంప్ (My Stamp) ప్రతిపాదనను ఆయన ప్రశంసిస్తూ, అది సమీప భవిష్యత్తులో ఆమోదం పొందబోతోందని తెలియజేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ శ్రీ కె. అమర్నాథ్ గారు మాట్లాడుతూ, ఈ ఎన్-జెన్ పోస్టాఫీస్ విద్యార్థులను ఆధునిక పోస్టల్ మరియు డిజిటల్ ఫైనాన్షియల్ సేవలకు అనుసంధానం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అలాగే, ఈ కొత్త పోస్టాఫీస్ యొక్క ఆధునిక సదుపాయాలు, ఆకర్షణీయమైన వాతావరణం (Ambience), నూతన తరానికి అనుగుణంగా రూపొందించిన లుక్ విద్యార్థులను ఆకట్టుకున్నాయని, విద్యార్థులు ఈ సేవల పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ వి. శంకర్ గారు జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కాలేజ్ చరిత్రను మరియు పోస్టల్ శాఖ అభివృద్ధిని గుర్తుచేస్తూ భావోద్వేగ ప్రసంగం చేశారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్లు శ్రీ ఉమామహేశ్వర గారు, గుంతకల్ సబ్‌డివిజన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీ విజయ్ భాస్కర్ గారు, అనంతపురం సబ్‌డివిజన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీ కృష్ణ చైతన్య గారు, ఇన్‌స్పెక్టర్లు శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు, శ్రీ పి. రమేష్ రెడ్డి గారు, మాస్టర్ ట్రైనర్ శ్రీ బి.ఓ.ఆర్ గౌడ్ గారు, పబ్లిక్ రిలేషన్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రామ కృష్ణ గారు, బీడీఎంఈ శ్రీ జె. రామ్ మోహన్ రెడ్డి గారు, పోస్టుమాస్టర్ శ్రీ వి. శంకరయ్య గారు, ఆలుమ్ని ANEECA వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ వి. శంకర్ గారు, ఏటీపీ ఇంజినీరింగ్ కాలేజ్ ఎస్.ఓ సబ్ పోస్టుమాస్టర్ శ్రీ జి. నరేష్ గారు, పోస్టల్ అసిస్టెంట్ శ్రీ బి. హర్ష వర్ధన్ రెడ్డి గారు, ఆఫీస్ అసిస్టెంట్లు, పోస్టల్ అసిస్టెంట్లు, పోస్టుమెన్, జిడిఎస్ సిబ్బంది మరియు కాలేజ్ సిబ్బంది, అన్ని శాఖల విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ ఎన్-జెన్ పోస్టాఫీస్ ప్రారంభంతో విద్యార్థులకు, అధ్యాపకులకు మరియు సమాజానికి ఆధునిక, వేగవంతమైన మరియు సులభమైన పోస్టల్ సేవలు మరింత చేరువైనట్లు తెలిపారు.
శ్రీ కె. అమర్నాథ్
సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్
అనంతపురం డివిజన్
