కర్నూలు జిల్లా…
కర్నూలు జిల్లా హొలగుంద లో ఆయా పార్టీ లీడర్లు,జర్నలిస్టుల పై క్షుద్ర పూజల కలకలం
హొలగుందలోని శ్రీ సాయి బన్న దర్గా వెనకాల స్మశానంలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు…
23 మంది పాస్ ఫోటోలు పెట్టి తాయత్తులు కట్టి క్షుద్ర పూజలు చేసిన వైనం..
ముళ్ల పంది ముల్లులకు పాస్ ఫోటోలు గుచ్చి తాయత్తు రేకులకు చీటీల లో పేర్లు రాసి వాటికి చుట్టి క్షుద్ర పూజలు చేసిన వైనం..
హొలగుంద కు చెందిన ఒక ముస్లిం వ్యక్తి తమ భూమి విషయంలో వీరు న్యాయం చేయలేదని క్షుద్రపూజలు చేసినట్లు సమాచారం..
ఇద్దరు మహిళ ల పై కూడా క్షుద్రపూజలు..
తమ ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందనే భయాందోళనలో లీడర్లు,జర్నలిస్టులు.
గత అమావాస్య రోజు క్షుద్రపూజలు జరిగినట్లు అనుమానం..
ఎక్కువగా ముస్లిం కుటుంబాలకు చెందిన వ్యక్తులపైనే క్షుద్రపూజలు..
స్మశానంలో క్షుద్రపూజల స్థానంలో ఉన్న తమ ఫొటోలను కాల్చిన భాదితులు..
కర్నూలు జిల్లా హొలగుంద పట్టణంలో ఆదివారం క్షుద్రపూజల కలకలం అందరిని భయాందోళనకు గురిచేసింది.పట్టణంలో ఉన్న వైసిపి,టీడీపి,ఎస్ డి పి ఐ పార్టీ నాయకులు,ముగ్గురు జర్నలిస్టుల ఫొటోలు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళల పాస్ ఫొటోలకు తాయత్తులు కట్టి ఆయా వ్యక్తుల పేర్లు రాసి వాటికి చుట్టి ముళ్ల పంది ముల్లులకు గుచ్చి క్షుద్రపూజలు చేసిన సంగతి తెలిసింది. అయితే పట్టణానికి చెందిన ముస్లిం వ్యక్తి తన భూమి విషయంలో వీరిదగ్గరికి వెళ్లగా ఎవ్వరూ కూడా ఆయనకు న్యాయం చేయలేదని కోపంతో అలాగే తనకు అన్యాయం చేసిన ఒక కుటుంబానికి చెందిన వ్యక్తుల ఫొటోలను సేకరించి వారిపై గత అమావాస్య రోజు పట్టనానికి సమీపంలో సాయిబన్న దర్గా వెనుక స్మశానంలో క్షుద్రపూజలు చేసినట్లు తెలిసింది.అయితే పంచాయతీకి చెందిన కార్మికులు చెత్తను వేయడానికి వెళ్లగా 23 మంది ఫొటోలు చూసి వారికి సమాచారం అందించారు.అయితే ఫొటోలు ఉన్న వ్యక్తులు వేరొక మంత్రగాడిని అడిగి వాటిని కాల్చేశారు.అయితే దీనిపై హొలగుంద పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నట్లు సమాచారం.అయితే ఇంతవరకు ఎవ్వరూ పిర్యాదు చేయలేదని కేవలం తమరిని భూమి విషయంలో ఎంటర్ అవకుండా భయపెట్టేందుకు ఈ క్షుద్రపూజలు చేసినట్లు చెబుతున్నారు.ఏది ఏమైనా 23 మంది వ్యక్తులపై క్షుద్రపూజలు చేయడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
