Latest Posts

వేదావతి ప్రాజెక్ట్ ఆలూరు ప్రాంతానికి ‘సంజీవిని’: పనుల్లో జాప్యంపై మండిపడ్డ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు క్రాంతి నాయుడు

— కర్నూలు జిల్లా ఆలూరువేదావతి ప్రాజెక్ట్‌పై అత్యవసర స్పందన అవసరం..డీసీసీ
–ఆలూరు ప్రాంతానికి వేదావతి ప్రాజెక్ట్ సంజీవిని లాంటిది..క్రాంతి నాయుడు
–కర్నూలు ప్రాజెక్టులను విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ విమర్శ

ఆలూరు మండలం సహా పరిసర ప్రాంతాల అభివృద్ధికి అత్యంత కీలకమైన వేదావతి ప్రాజెక్ట్ అమలులో జరుగుతున్న తీవ్ర ఆలస్యం, జాప్యం మరియు పరిపాలనా నిర్లక్ష్యంపై సోమవారం వేదావతి ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పూల రామాంజనేయులు అధ్యక్షత వహించాగా. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బోయ క్రాంతి నాయుడు మాట్లాడుతూ, వేదావతి ప్రాజెక్ట్ ఆలూరు ప్రాంతానికి సంజీవిని లాంటిదని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే వేలాది మంది రైతులకు సాగునీటి సదుపాయం లభిస్తుందని, భూగర్భ జలాల స్థాయి పెరుగుతుందని, కరువు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన తెలిపారు. అయితే పలుమార్లు హామీలు ఇచ్చినా ప్రాజెక్ట్ పురోగతి నిరాశాజనకంగా ఉండటం విచారకరమని అన్నారు. ప్రాజెక్ట్ ఆలస్యం వల్ల రైతుల పంటలు, జీవనోపాధి, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని, ఇది ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని స్పష్టంగా తెలియజేస్తోందని విమర్శించారు. కర్నూలు జిల్లాకు సంబంధించిన కీలక ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు. వేదావతి ప్రాజెక్ట్ ప్రస్తుత స్థితిపై తక్షణ సమీక్ష చేపట్టి, ఆలస్యానికి కారణమైన అంశాలను గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీసీసీ డిమాండ్ చేసింది. అలాగే పనులను వేగవంతం చేసి స్పష్టమైన టైమ్‌లైన్‌తో ప్రజలకు పారదర్శక సమాచారం అందించాలని కోరింది. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షులు సూర్య ప్రకాష్ రెడ్డి, ఓబీసీ సెల్ అధ్యక్షులు సాంబశివుడు, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రాఘవేంద్ర రెడ్డి, మాజీ సర్పంచ్ లక్ష్మన్న, సీనియర్ నాయకులు బంగారు వీర ప్రసాద్, మాజీ జిల్లా కార్యదర్శి కేపీ రహీమ్ బాషా, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రకాశ్, పఠాన్ సద్దాం, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor