Latest Posts

జేఎన్టీయూ అనంతపురంలో 15వ స్నాతకోత్సవ వేడుకలు: ‘మిస్సైల్ ఉమెన్’ టెస్సీ థామస్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన గవర్నర్

అనంతపురం జిల్లా, జేఎన్టీయూ.

సామాజిక అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు

గౌరవ రాష్ట్ర గవర్నర్
ఎస్ .అబ్దుల్ నజీర్ గారు…..

అనంత జేఎన్టీయూలో ఘనంగా 15వ స్నాతకోత్సవ వేడుకలు…
ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ రాష్ట్ర గవర్నర్

మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా టెస్సీ థామస్ కు గౌరవ డాక్టరేట్ ప్రధానం
74 మందికి డాక్టర్ రేట్లు
31 మందికి బంగారు పథకాలు …
స్నాతకోత్సవానికి 40 వేల మందికి పైగా విద్యార్థులకు వివిధ డిగ్రీలు ప్రధానం…

అనంతపురం, ఏప్రిల్ 6

సామాజిక అవసరాలకు అనుగుణంగా పరిశోధన మరియు సాంకేతిక ఆవిష్కరణలు సుస్థిర అభివృద్ధి ముందుకు తీసుకెళ్లాగా బలమైన సామర్థ్యం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉందని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. సోమవారం అనంతపురం జేఎన్టీయూ ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరిగిన 15వ స్నాతకోత్సవా నికి గవర్నర్ ఛాన్స్లర్ హోదాలో మరియు ముఖ్య అతిథిగా హాజరై వేడుకలకు శోభను చేకూర్చారు.
అంతకుముందు జేఎన్టీయూ గెస్ట్ హౌస్ వద్ద గవర్నర్ పోలీసు గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా గౌరవ గవర్నర్ కు జిల్లా జాయింట్ కలెక్టర్ సి .విష్ణు చరణ్, రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వెంకటప్ప, హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ మధు మూర్తి, వై స్ ఛాన్స్లర్ సుదర్శన్ రావు, రిజిస్టారర్ కృష్ణయ్య, డైరెక్టర్ ఆఫ్ ఎవల్యూషన్ డా. నాగప్రసాద్ నాయుడు తదితరులు పుష్పగుచ్చాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఉపకులపతి హెచ్. సుదర్శన్ రావు అధ్యక్షతన జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర గవర్నర్ గారు మాట్లాడుతూ అత్యుత్తమైన విద్య అంటే కేవలం మనకు సమాచారాన్ని అందించేదే కాదని మన జీవితంలో సమస్త సృష్టిలో సామరస్యంగా ఉండేలా తీర్చిదిద్దేనని రవీంద్రనాథ్ ఠాకూర్ పలికిన మాటలు గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ విస్తృతమైనసంళీతమైనఉన్నత విద్యాభివృద్ధి చేస్తోందని, మహిళల భాగస్వామ్యాన్ని పెంచి జాతీయ సగటు కంటే అధికంగా 36.5% స్థూల నమోదు నిష్పత్తి 10.93 స్థూల సూచికతో స్థిరమైన పురోగతిని ప్రతిబింబి స్తోందన్నారు. జాతీయ విద్యా విధానం ద్వారా2020అమల్లో భారతదేశం ఉన్నత విద్య పరివర్తనాత్మక మార్పుకు నాంది పలికిందని ఇది విద్యార్థుల అభివృద్ధికి తోడ్పాటు అందించే విధంగా ఉందని పేర్కొన్నారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామిక విస్తరణ మౌలిక సదుపాయాల ఆధునికరణ సమగ్ర ఆర్థిక పునరజీవనం దిశగా ముందుకు సాగుతోందని పునరుత్పాదక ఇంధనం ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆహార శుద్ధి వంటి రంగాలలో భారీ పెట్టుబడులు ఆకర్షిస్తూ మెరుగైన రహదారి నెట్వర్క్ అభివృద్ధిఅంతర్గతజలమార్గాలు పోర్టుల ఆధారత అభివృద్ధి విమానాశ్రయాల విస్తరణ వంటి వాటికి పరిశ్రమ వాణిజ్యం కోసం ఒకస్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు గౌరవ రాష్ట్ర గవర్నర్ తెలిపారు. కేంద్రంలో గౌరవ ప్రధాని నరేంద్ర మోది నాయకత్వంలోని ప్రభుత్వం భారతదేశంను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా సాంకేతిక రంగాన్ని అనేక విధాలుగా తీర్చి దిద్దుతున్నట్లు తెలిపారు.
విశ్వవిద్యాలయంలోని
విద్యార్థులకు క్రమబద్ధమైన ఇంటర్షిప్ అవకాశాలను కల్పించడానికి మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సుల ద్వారా పరిశ్రమకు సంబంధించిన కోర్సులను అందించడానికి విశ్వవిద్యాలయం కృషి చేస్తుందని ఐఐటి మద్రాస్ ఫ్యాకల్టీ డైరెక్టర్ లతో సహా వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందంకుదుర్చుకున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని గవర్నర్ పేర్కొన్నారు. ఈసహకారంద్వారావిద్యార్థుల పారిశ్రామిక వాతావరణం భద్రత ప్రమాణాలునియంత్రణ చట్టాలునిత్యసమయకార్యాచరణ పద్ధతులపై విలువైన అవగాహన పొందుతార న్నారు. మీ జ్ఞానం మీకు మాత్రమే కాకుండా యావత్తు సమాజానికి ఉపయోగపడేలా విద్యార్థులు తమ జీవితంలో ముందుకుసాగాలని నిజాయితీ పట్టుదల కరుణ అనే విలువలతో సత్ప్రవర్తనాలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. నిరంతరం నేర్చుకుంటూ నూతన ఆవిష్కరణలుచేస్తూవిద్యార్థులు చేపట్టే అన్ని పనుల్లోనూ శాష్టత కోసం కృషి చేయాలి అన్నారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం వారిని అన్ని విధాల ప్రోత్సహించాలన్నారు.
విద్యార్థులు పొందిన జ్ఞానం సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలని మీరు సాధించిన విజయాలు మీరు చదువుకున్న విద్యాసంస్థకు గర్వకారణంగా నిలవాల న్నారు.
ఈరోజు అనంతపురంలో విద్యార్థులకు ఒక కలల పండుగగా స్నాతకోత్సవం జరుగుతున్న నేపథ్యంలో తాను పాల్గొనడం ఎంతో అదృష్టంగా, సంతోషంగా ఉందన్నారు.అనంతరం కొంతమంది ప్రతిభావంతులైన విద్యార్థులకుబంగారుపతకాలను, అలాగే పలువురికి పరిశోధకుల పీహెచ్డీ పట్టాలు ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా వైస్ ఛాన్స్లర్ సుదర్శన్ రావు మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం చిత్తూరు కడప కర్నూలు నెల్లూరు జిల్లాలోని సాంకేతిక ఔషధ కళాశాలలు జేఎన్టీయూ పరిధిలోకి వస్తాయని ఇంజనీరింగ్ ఫార్మసీ ఎంబీఏ ఎంసీఏ కళాశాలలు మొత్తం 130 దాకా ఉన్నాయన్నారు.
అన్ని కళాశాలలో కలిపి వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ఈరోజు బంగారు పథకాలు అలాగే విశ్వవిద్యాలయం దీని అనుబంధ కళాశాలలో బీటెక్ బి ఫార్మసీ ఎంటెక్ ఎం ఫార్మసీ ఎంసీఏ ఎంబీఏ ఫార్మసీ డి పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీ పట్టాలు పీహెచ్డీ డాక్టర్ రేట్లు ప్రధానం చేయడం జరిగిందన్నారు.
ముఖ్యంగా సాంకేతిక విద్యలో అనంతపురం జేఎన్టీయూ జాతీయస్థాయిలో ప్రత్యేక స్థానం ప్రత్యేక స్థానం సంపాదించుకుందన్నారు. సమాజానికి ఎంతోమంది శాస్త్రవేత్తలు ఇంజనీరింగ్ నిపుణులను అందించిన ఘనతఈవిశ్వవిద్యాలయానికి దక్కుతుందన్నారు. మరి ముఖ్యంగా ప్రముఖ అంతరిక్ష క్షిపని శాస్త్రవేత్త టెస్సీకు గౌరవ డాక్టరేట్ ప్రధానం గవర్నర్ చేతుల మీదుగా అందజేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

అంతకుముందు ప్రముఖ శాస్త్రవేత్త టెస్సీ థామస్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నేడు ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఇన్స్టిట్యూట్ మెడల్స్ పొందిన టాపర్లకు మరియు 20 25 లో పట్టభద్రులైన విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు.
స్నాత కోసం అనేది పట్టుదలకు ఒక వేడుక అని క్రమశిక్షణకు ఒక నివాళి మరియు అపరిమితమైన అవకాశాలకు ఒక ముఖ ద్వారం అని ఇది సంవత్సరాల తరబడి అంకిత భావం పట్టుదల మరియు అభ్యసనం పట్ల అంచంచలమైన నిబద్ధతకు నిదర్శనం అన్నారు. విద్యార్థులు దీనిని కార్యరూపం దాల్చి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరుస్తూ ఆత్మవిశ్వాసంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు.
తాను విద్యాప్రస్థానాన్ని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ప్రారంభించి ఆ తర్వాత గైడెడ్ మిస్సెస్ లో ప్రత్యేకత సాధించి జేఎన్టీయూ హైదరాబాద్ నుండి మిస్సైల్స్ గైడెన్స్ లో పిహెచ్డి పట్టా పొందినట్లు తెలిపారు. డి ఆర్ డి ఓ లో నా వృత్తి జీవితం భారత దేశపు వ్యూహాత్మక క్షిపణి కార్యక్రమాలకు సాంకేతిక అభివృద్ధి తయారీ పరీక్ష వ్యవస్థ దృవీకరణ మరియు నిర్వహణ వంటి రంగాలలో పాలుపంచుకునే అవకాశం కలిగిందన్నారు. అంతేకాక అధునాతన రక్షణ పరిశోధనలో కీలక నాయకత్వం పాత్రలు పోషించే అవకాశాన్ని కల్పించిందన్నారు. అగ్ని ఒకటి నుండి అగ్ని ఐదు వరకు మనం స్వాలంబన సాధించి రక్షణ సామర్థ్యంతో భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టామని మన శాస్త్రవేత్తలు మరియు సాంకేతిక నిపుణుల నిరంతర కృషి దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్న శక్తిగా మారుస్తున్నట్లు తెలిపారు. ఈ గర్వించదగిన సందర్భంలో నా హృదయపూర్వక అభినందనలు అని తెలిపారు. ప్రస్తుత విద్యార్థులు వృత్తి నిపుణులుగా ఆవిష్కర్తలుగా వివిధ రంగాలలో రాణించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంగణం వెలుపల మీకోసం ఎదురు చూస్తున్న అద్భుతమైన ప్రపంచానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ మాజీ మంత్రివర్యులు మరియు రాప్తాడు శాసన సభ్యురాలు శ్రీమతి పరిటాల సునీతమ్మ,
మాజీ మంత్రివర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి, వివిధ యూనివర్సిటీలకు కళాశాలకు చెందిన ఆయా యాజమాన్య ప్రతినిధులు
జిల్లా జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి ఎస్పీ సతీష్ కుమార్ ,చిత్తూరు ఏఎస్పీదేవదాస్,అనంతపురం డి ఎస్ పి శ్రీనివాస్ అనంతపురం ఆర్డీవో కేశవ నాయుడు , నార్పల తాసిల్దార్ శ్రీధర్ మూర్తి , అనంతపురం తాసిల్దార్ మోహన్ కుమార్ రాజా తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor