Latest Posts

నిడిగల్లులో ‘జలధార’ పనులకు శ్రీకారం: భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా రూ. 4.40 లక్షలతో ఫీడర్ ఛానెల్ నిర్మాణం

తాడిమర్రి(yes9tvనిడిగల్లు పంచాయతీలో జలధార కార్యక్రమం ప్రారంభం
తాడిమర్రి మండలంలోని నిడిగల్లు పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “జలధార” కార్యక్రమంలో భాగంగా చెరువులోకి వర్షపు నీరు చేరేందుకు ఫీడర్ ఛానెల్ పనులను రూ. 4.40 లక్షల అంచనాతో ఈరోజు ప్రారంభించారు.
ఈ కార్యక్రమాన్ని ఎంపిడిఓ వెంకటరంగారావు మరియు తాజా మాజీ సర్పంచ్ గోనుగుంట్ల నాగభూషణ నాయుడు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించగా, డిప్యూటీ ఎంపిడిఓ విజయశేఖర్ నాయుడు గడ్డపారతో మట్టిని త్రవ్వి పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమంలో RWS ఇంజనీర్ ఫమీద భాను, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మల్లికార్జున, ఏపీఓ అనిల్ కుమార్ రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ అనురాధ, పంచాయతీ కార్యదర్శి హేమలత, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉదయ్ భాస్కర్, సచివాలయ సిబ్బంది మరియు FA కవితా నరేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ నాగభూషణ నాయుడు మాట్లాడుతూ గ్రామాల్లో తగ్గుతున్న భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రభుత్వం విభిన్న శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు. 100 రోజుల వ్యవధిలో కనీసం 1 మీటరు నుంచి 1.5 మీటర్ల వరకు భూగర్భ జలాల మట్టాన్ని పెంచే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.
ఎంపిడిఓ వెంకటరంగారావు మాట్లాడుతూ గ్రామాల్లో వర్షపు నీటి నిల్వ కోసం ఫీడర్ ఛానెల్స్, కందకాలు త్రవ్వడం, చెరువులు మరియు చెక్‌డ్యామ్‌లలో పూడిక తొలగించడం, తాగునీటి బోర్లు మరియు చేతి పంపుల వద్ద రీచార్జ్ పిట్స్ నిర్మించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ పనులకు సంబంధించిన ప్రతిపాదనలను పంచాయతీ కార్యదర్శి లేదా NREGS సిబ్బందికి తెలియజేయాలని ఆయన కోరారు.

Posted Under AP
Editor