తాడిమర్రి (yes9tv)
తాడిమర్రి మండల కేంద్రంలో “మా ఊరు – మన జెండా” కార్యక్రమాన్ని మండల కన్వీనర్ దేవర రాము ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు జి.ఎం. శేఖర్ స్వామి, “మా ఊరు – మన జెండా” కార్యక్రమం అధ్యక్షుడు చల్లపల్లి నరసింహారెడ్డి, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు అంబటి సతీష్, ధర్మవరం నియోజకవర్గ “మా ఊరు – మన జెండా” ఇంచార్జ్ మరియు ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు బీజేపీ పార్టీ సిద్ధాంతాలు, పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు మరియు ఇతర ముఖ్య అంశాలపై నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు వివరించారు. అనంతరం జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమం అనంతరం మండల కన్వీనర్ దేవర రాము గృహంలో ఏర్పాటు చేసిన తేనేటి విందులో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతరం తాడిమర్రి మండలంలోని మరిమేకలపల్లి గ్రామంలో నిర్వహించిన “మా ఊరు – మన జెండా” కార్యక్రమంలో కూడా నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొంక నాగార్జున, ఆరవేటి ఆనంద్, ఆరవేటి సదాశివానంద, బిల్లే చంద్ర, సింగిల్ విండో డైరెక్టర్ అనుగుర్తి రమణ, గంగాధర్, గంగులప్ప, ఉప్పర శ్రీనివాసులు, సురేంద్ర, ఏటుకూరి నాయుడు, పుల్లయ్య, వైస్ ఎంపీపీ కృష్ణమనాయుడు, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు గంగులప్ప, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు రామాంజనేయులు, అశోక్, ఓసురప్ప, ప్రధాన కార్యదర్శి భాస్కర్ నాయుడు, వెంకట నాయుడు తదితరులు పాల్గొన్నారు.
భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
