అనంతపురం జిల్లా,తాడిపత్రి.
జలధార- నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
• నీరు మనందరికీ సర్వస్వం… దానిని సంరక్షించుకోడానికే వంద రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టాం
• రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రత కోసమే పనిచేస్తున్నాం. పరిగెత్తే నీటిని నిలబెట్టాలి, నిలబడిన నీటిని నిల్వ చేయాలి జలాశయాలు నింపేందుకు ప్రయత్నించాలి
• ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్ లు, తుంపర సేద్యం, సూక్ష్మసేద్యం లాంటి అనేక ప్రయత్నాలు చేసి ముందుకు వెళ్లాం
• పంటకుంటలు, కాలువలు, చెరువుల్లో మట్టి తీసి పొలాల్లో వేశాం.
• ఎన్టీఆర్ జలసిరి ద్వారా ట్రెంచ్ లు, నీరు చెట్టు, నీరు మీరు, నీరు ప్రగతి లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టాం
• నీటి భద్రతా కార్యక్రమంలో రైతులు, సాగునీటి సంఘాల లాంటి భాగస్వాములతో ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం
• అనంతపురం లాంటి ప్రాంతాల్లో కొన్ని ఏళ్లపాటు నీరే లేదు. నష్ట పోతున్న రైతులను ఆదుకోడానికి ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చింది కూడా టీడీపీనే
• అనంతపురం జిల్లాలో నీటిని సద్వినియోగం చేసుకోవాలని డ్రిప్ ఇరిగేషన్ కార్యక్రమం తీసుకువచ్చాం.
• 90 శాతం మేర సబ్సిడీ తో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను ఇచ్చింది కూడా గతంలో మేమే
• మైక్రో ఇరిగేషన్ పై గతంలో ఇచ్చిన నివేదికే ప్రామాణికంగా మారి దేశంలో అంతా వినియోగించే పరిస్థితి వచ్చింది
• ప్రస్తుతం మైక్రో ఇరిగేషన్ లో రూ.1,031 కోట్లు వ్యయం చేస్తూ దేశంలో నెంబర్ వన్ గా ఉన్నాం
• డ్రిప్ ఇరిగేషన్ వల్లే రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా మారింది. హార్చికల్చర్‌లో దేశంలో అగ్రస్థానంలో ఉన్నాం
• పూర్వోదయ స్కీమ్ ద్వారా కేంద్రం నుంచి రూ.30 వేల కోట్లు, ప్రైవేటు ద్వారా మరో రూ.70 వేల కోట్లతో అభివృద్ధి చేస్తాం
• గడచిన 21 నెలల్లో నీటి భద్రతా పరంగా చాలా మార్పులు వచ్చాయి. చెరువులు పెద్ద ఎత్తున నింపగలిగాం
• జల సంరక్షణా చర్యల కారణంగా భూగర్భజలాలను 1.92 మీటర్ల మేర అదనంగా పెంచగలిగాం
