జిల్లా : కర్నూలు
సెంటర్ : ఆలూరు
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు ‘మన ఊరు – మన జెండా’ కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించాయి. ఆలూరు, హాలహర్వి మరియు పచ్చరపల్లి గ్రామాల్లో బీజేపీ జెండాను ఆవిష్కరించి, పార్టీ బలోపేతానికి కార్యకర్తలు నడుం బిగించారు.
ఆలూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుమ్మనూరు కమలమ్మ, గుమ్మనూరు నారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పార్టీ జెండాను ఆవిష్కరించి, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయన్నారు
“నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎన్.ఆర్.జి.ఎస్ (NRGS) నిధులు మంజూరు చేస్తోంది. సీసీ రోడ్ల నిర్మాణం మోదీ ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే సాధ్యమవుతోంది. కానీ స్థానిక ఎమ్మెల్యే మాత్రం ఇవి రాష్ట్ర నిధులని చెప్పుకోవడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం. కూటమి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో కేంద్ర నిధులు సక్రమంగా వినియోగించబడుతున్నాయి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి భారీ విజయం సాధించడం ఖాయం. ఆలూరు గడ్డపై కూటమి జెండాను ఎగరేస్తాం.”
