తాడిపత్రి/యాడికి
• జలధార సభలో అమరావతికి చట్టబద్దతపై హర్షాతిరేకాలు
• స్వయంగా అమరావతి లోగో పట్టుకుని సభకు హాజరైన జేసీ ప్రభాకర్ రెడ్డి
• అమరావతి బ్యాడ్జిని సీఎం చంద్రబాబుకు అందించిన తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి
• రాజధానికి చట్టబద్దతపై హర్షం వ్యక్తం చేస్తూ ప్లకార్డులు, జెండాలు ప్రదర్శించిన సీమ ప్రజలు
• సభలో అమరావతి గురించి భావోద్వేగంగా ప్రసంగించిన ముఖ్యమంత్రి
• రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీ వైసీపీ అంటూ ముఖ్యమంత్రి కామెంట్లు
• దిక్కుమాలిన పార్టీ వైసీపీ అంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
• రాష్ట్రం మీద పగ పట్టినట్టు వైసీపీ వ్యవహరిస్తోందన్న ముఖ్యమంత్రి
• ఫ్యాక్షనిస్టులు, ముఠా నాయకుల కంటే ఘోరంగా రాష్ట్రాభివృద్ధిని వైసీపీ అడ్డుకుంటోందన్న ముఖ్యమంత్రి
• రాష్ట్రాన్ని మూడు రీజియన్లుగా అభివృద్ధి చేస్తున్నామని ఏపీ డెవలప్మెంట్ ప్లాన్‌ను సభలో వెల్లడించిన సీఎం
• పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధత ఆమోదానికి గుర్తుగా సీఎంకు అమరావతి జ్ఞాపికను అందించిన జేసీ పవన్ రెడ్డి
