Latest Posts

జల సంరక్షణ ఓ ప్రజా ఉద్యమం కావాలి: ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పిలుపు

నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత’ నీటి సంరక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు

నీటి భద్రత కోసం వంద రోజుల ప్రజా ఉద్యమం!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ రాష్ట్ర చరిత్రలో ఒక సాహసోపేతమైన ముందడుగు. గత పాలనలో నిర్లక్ష్యానికి గురైన సాగునీటి సంఘాలను మళ్లీ క్రియాశీలం చేస్తూ, సుమారు 60 వేల మంది సభ్యులను ఈ జల సంరక్షణ ఉద్యమంలో భాగస్వామ్యం చేయడం అధికార వికేంద్రీకరణకు నిదర్శనం. వేసవి ఎండలు మండుతున్నప్పుడే, యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టి, వర్షాకాలం వచ్చే నాటికి ప్రతి నీటి చుక్కను భూమి పొరల్లోకి పంపాలనే లక్ష్యం.

జలధార’ స్ఫూర్తితో వాగులు, వంకలను అనుసంధానిస్తూ, ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టేలా క్షేత్రస్థాయిలో యంత్రాంగం కదలాలి. మైక్రో ఇరిగేషన్ ద్వారా ప్రతి చుక్కను సమర్థంగా వాడుకుంటూ, సాగునీటి సంఘాలే చోదక శక్తిగా ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించాలిన తెలియజేసిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు మరియు టీడీపీ నాయకులు పవన్ కుమార్ రెడ్డి గారు, నీటి సంఘాల నాయకులు,రూరల్ మండల కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Posted Under AP
Editor