Latest Posts

ముదిగుబ్బను నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలి: బీజేపీ కిసాన్ మోర్చా డిమాండ్

భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సోమల ప్రకాష్ నాయుడు

మండల కేంద్రమైన ముదిగుబ్బ పట్టణాన్ని నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలని సోమవారం జనతా వారిది లో సత్యసాయి జిల్లా కలెక్టర్ గారికి ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, దేశంలో నియోజకవర్గాల పునర్విభజనకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపిన నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా 50% పైగా పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలు ఏర్పాటు అవుతాయనే సమాచారం మేరకు ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో కూడా మూడు పార్లమెంట్ స్థానాలు
21 అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు కానున్న నేపథ్యంలో ధర్మవరం నియోజకవర్గంలో ఉన్న ముదిగుబ్బ మండలాన్ని కూడా నియోజకవర్గ కేంద్రం చేస్తారని మండల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న తరుణంలో ముదిగుబ్బను నియోజకవర్గ కేంద్రంగా కాకుండా ఈ ప్రాంతాన్ని గతంలో మాదిరి తిరిగి కదిరి నియోజకవర్గం లోనే విలీనం చేస్తారని గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతూ మండల ప్రజలు నిరాశ చెందుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారుఈ విషయమై స్పందించారు, ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ విస్తీర్ణంలో రాష్ట్రంలోనే పెద్ద మండలం గా పేరుగాంచడమే గాక జనాభాలో సత్యసాయి జిల్లాలో పెద్ద మండలం గా గుర్తింపు పొందిన ఈ మండలంలో దాదాపు 74. వేల జనాభా 51 వేల మంది ఓటర్లు ఉండడమే గాక 25 గ్రామపంచాయితీలు
86 గ్రామాలు ఉన్నాయన్నారు, దీనికి తోడు మేజర్ పంచాయతీ గా గుర్తింపు పొందిన ముదిగుబ్బ పట్టణంలో దాదాపు 24.వేల జనాభా ఉండి 5వేలకు పైగా నివాస గృహాలు ఉన్నాయన్నారు, అదేవిధంగా జిల్లా కేంద్రాలైన పుట్టపర్తి నుంచి వచ్చే 342వ జాతీయ రహదారి తో పాటు అనంతపురం చెన్నై 42వ జాతీయ రహదారి కూడా ముదిగుబ్బ to పుట్టపర్తి nh. 342 మీదుగా వెళుతుండడమే గాక నిర్మాణంలో ఉన్న కర్ణాటక నుంచి ఏపీ రాజధాని అమరావతికి వెళ్లే గ్రీన్ ఫీల్డ్ రహదారి కూడా ఈ మండలం మీదుగా వెళ్తుండడమే గాక త్వరలో ముద్దనూరు ముదిగుబ్బ రైలు మార్గం కూడా నిర్మాణం జరిగి తద్వారా ముదిగుబ్బ రైల్వే స్టేషన్ జంక్షన్ గా కూడా మారే అవకాశం ఉందని ఇప్పటికే రైల్వే ఉన్నతాధికారులు పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే, దీంతో రాబోయే రోజుల్లో ఎంతో పెద్ద ఎత్తున అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉన్న ఈ ముదిగుబ్బను నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలని మండల ప్రజలు ఎంతో ఆకాంక్షిస్తున్నారన్నారు, 2009కి ముందు కదిరి నియోజకవర్గంలో ఉన్న ఈ మండలాన్ని అనంతరం ధర్మవరం నియోజకవర్గ వర్గంలోకి చేర్చి నేటివరకు ఈ నియోజకవర్గంలో కొనసాగుతుందన్నారు, కాగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్ విభజన చేపట్టి 2029లో కొత్తగా ఏర్పాటు అయిన నియోజకవర్గాలతో కలిపి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికైనా ముదిగుబ్బ మండలాన్ని కదిరి, ధర్మవరం నియోజకవర్గాల్లోకి తరచూ విలీనం చేయకుండా ఈసారైనా మండల కేంద్రమైన ముదిగుబ్బ పట్టణాన్ని సమీపంలోని వివిధ మండలాలతో కలిపి నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు, లేనిపక్షంలో ముదిగుబ్బను నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలనే సత్యసాయి జిల్లా కలెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపి ముదిగుబ్బ నియోజకవర్గంగా ప్రకటిస్తారని ఆశిస్తున్నాం
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు,

Posted Under AP
Editor